సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన పిచ్చి ఉంటుంది . కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి క్రేజ్, కొందరికి అమ్మాయిల పిచ్చి.. ఇలా సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన పిచ్చి కన్ ఫామ్ గా ఉంటుంది . ఆ పిచ్చితో మనకు పిచ్చెక్కించేస్తారు సెలబ్రిటీస్ . దాన్ని చూసి పిచ్చెక్కించి అభిమానం పెంచుకుంటారు ఈ పిచ్చి అభిమానులు. ఏది ఏమైనా కానీ సినీ ఇండస్ట్రీలో పిచ్చి అనేది మాత్రం చాలా కామన్ అని పిచ్చపిచ్చగా అర్థం అయిపోయింది.
సినీ ఇండస్ట్రీలో మొదట కమెడియన్ గా ఆ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ గా తనదైన స్టైల్ లో సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లు రామలింగయ్య కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ ..తనదైన స్టైల్ లో నటించి జనాలను మెప్పించాడు . ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి మంచి మంచి సినిమాలను నిర్మించి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్రను వేసుకున్నాడు. అల్లు అరవింద్ ఖాతాలో బోలెడన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే సినిమాల పరంగా ఎలా ఉన్నా కానీ కెరియర్ పరంగా అల్లు అరవింద్ కు ఒక పిచ్చి ఉందట. అదే “పాపులారిటీ”. ఎస్ ఎక్కడికైనా సరే మీడియా ముందుకు వచ్చినప్పుడు అల్లు అరవింద్ తానే ఫోకస్ అవ్వాలి అన్నంత విధంగా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారట.
ఏదైనా ఫంక్షన్ లో స్పీచ్ ఇవ్వాలన్నా కానీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాలి అనుకున్న కానీ వారం రోజుల ముందు నుంచి అల్లు అరవింద్ పక్క ప్లానింగ్ తో ఏ విధంగా మాట్లాడితే తాను పాపులారిటీ సంపాదించుకుంటాను మీడియాలో హాట్ టాపిక్ గా మారుతాను అని ప్లాన్ చేసుకొని మరి తన స్క్రిప్ట్ ని రెడీ చేసుకుంటారట . అంతేకాదు తన కొడుకులు తాను ఇద్దరు ఒకేసారి స్టేజిపై మాట్లాడాల్సి వచ్చినా కానీ అల్లు అరవింద్ తానే హైలెట్గా మారాలని పాపులారిటీ దక్కించుకోవాలని సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలవాలని ట్రై చేస్తూ ఉంటారట. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ న్యూస్ విన్న జనాలు ఆ మాట నిజమే అల్లు అరవింద్ కి పబ్లిసిటీ పాపులారిటీ పిచ్చి ఉంది. అందుకే కదా ఇలా తయారవుతున్నాడు రోజురోజుకి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆహా ఓటీటీ ప్లాట్ ఫాం ద్వార తెలుగు జనాలకు మమ్రింత దగ్గరైయ్యాడు. అంతేనా బాలకృష్ణను హోస్టుగా చూడాలి అనుకున్న నందమూరి అభిమానుల కోరిక కూడా తీర్చింది అల్లు అరవిందే..!!