ఆచార్య సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ సినిమా డిజాస్టర్ నుంచి చిరు చాలా పాఠాలే నేర్చుకున్నట్టుగా ఉన్నారు. ఇక తాజాగా గాడ్ ఫాదర్ సినిమా విషయంలో సినిమాను ఎలా మార్కెట్ చేయకూడదో ? ఎలా డబ్బులు చేసుకోకూడదో మాత్రం చిరుకు బాగా తెలిసి వచ్చినట్టే ఉంది. ఆచార్య సినిమా అంత పెద్ద డిజాస్టర్ అవ్వడం వెనక మరో కారణం కూడా ఉంది. ఆ సినిమాను ఎడాపెడా భారీ రేట్లకు అమ్మేశారు. అందినకాడకు అడ్వాన్స్‌లు తీసేసుకున్నారు. చివరకు దర్శకుడు కొరటాల శివ కూడా రంగంలోకి దిగి ఆయనే బిజినెస్ డీల్స్ చేసేశారు.
తీరా సినిమా ఘోరంగా దెబ్బేయడంతో ఆ లాస్ కవర్ చేసుకునేందుకు అందరూ ఆఫీసుల చుట్టూ తిరిగారు. చివరకు కొరటాల శివ అయితే ఆ సినిమా రిలీజ్ ఏడెనిమిది నెలలు అవుతున్నా ఇంకా ఆ ఫీల్ నుంచి బయటకు రాలేదు. కొరటాల కూడా స్వయంగా తన ఆస్తులు అమ్మి డిస్ట్రిబ్యూటర్లకు కొంత సెటిల్ చేశారని అంటున్నారు. చివరకు చిరంజీవి అయితే తప్పంతా కొరటాలదే అన్న మాట ఇప్పట్లో వదిలేలా లేరు.
అందుకే గాడ్ ఫాదర్‌ను అన్ని ఏరియాల్లోనూ చాలా రీజనబుల్ రేట్లకే అమ్మారు. అది కూడా తనకు తెలిసిన వారి నుంచి చాలా తక్కువ అడ్వాన్సులే తీసుకుని మరి సినిమా ఇచ్చేశారు నిర్మాత ఎన్వీ. ప్రసాద్. అందుకే సినిమాకు అయిన బడ్జెట్‌కు జరిగిన బిజినెస్, వచ్చిన అడ్వాన్స్‌లకు సంబంధమే లేదని…చాలా తక్కువ మొత్తమే వచ్చిందని టాక్.
మరో ట్విస్ట్ ఏంటంటే గాడ్ ఫాదర్‌ను చాలా తక్కువ థియేటర్లలోనే రిలీజ్ చేశారు. ఎక్కువ థియేటర్లు పరిచేయలేదు. దీంతో ఫస్ట్ డే ఫిగర్లు కూడా చాలా తక్కువ కనిపించాయి. ఇక సోమవారం నుంచి ఈ సినిమా సత్తా ఏంటి ? ఈ సినిమాకు పాటించిన జాగ్రత్తలు ఎంత వరకు సక్సెస్ అవుతాయన్నది తెలుస్తాయి. ఏదేమైనా ఆచార్య విషయంలోలా హంగామా చేయకుండా చిరు పరువు తీయకుండా ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు పాటించారు.