Moviesమెహ్రీన్ చేతిలో టాలీవుడ్ స్టార్ హీరోకు ఘోర అవ‌మానం... రేటు తేడా...

మెహ్రీన్ చేతిలో టాలీవుడ్ స్టార్ హీరోకు ఘోర అవ‌మానం… రేటు తేడా వ‌చ్చింద‌నే షాక్‌..!

ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల‌కు లైఫ్ టైం త‌క్కువ ఉంటుంది. ఛాన్సులు వ‌స్తున్న‌ప్పుడే నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాలి. హీరోల్లా వాళ్లు 60 ఏళ్లు దాటినా ఇండ‌స్ట్రీలో ఉండ‌రు. మ‌హా అయితే 35 ఏళ్లు వ‌ర‌కు మాత్ర‌మే వారు ఉంటారు. ఆ త‌ర్వాత ఛాన్సులు రావ‌డం ఎంత గొప్ప హీరోయిన్‌కు అయినా క‌ష్ట‌మే. అందుకే ఛాన్సులు వ‌స్తున్న‌ప్పుడే కాస్త ఎక్కువ రేటు డిమాండ్ చేస్తూ నాలుగు డ‌బ్బులు సంపాదించుకుంటూ ఉంటారు.

ఇప్పుడు తెలుగులో సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్లు దొర‌క‌డం లేదు. దీంతో వాళ్లు మామూలు ఇబ్బందులు పడ‌డం లేదు. కాజ‌ల్‌, త‌మ‌న్నా, న‌య‌న‌తార లాంటి వాళ్ల‌కు కాస్త ఎక్కువ డ‌బ్బులు ఇచ్చి బ‌తిమిలాడుకుంటూ సెట్ చేసుకుంటున్నారు. అస‌లు ఎప్పుడో ఫేడ‌వుట్ అయిపోయిన శృతీహాస‌న్‌కు ఇప్పుడు ఏకంగా బాల‌య్య, చిరంజీవి సినిమాల్లో ఛాన్సులు రావ‌డానికి ఆమెకు భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేయ‌డ‌మే కార‌ణం.

ఇక సైరాలో చిరు ప‌క్క‌న చేసిన త‌మ‌న్నా.. ఇప్పుడు భోళాశంక‌ర్‌లో మ‌రోసారి న‌టిస్తోంది. సీనియ‌ర్ హీరోల సినిమాల్లో ఆఫ‌ర్లు అన‌గానే త‌మ‌న్నా, శృతీ లాంటి వాళ్లు బాగా డిమాండ్ చేసి దండుకుంటున్నారు. ఇక మెహ్రీన్ కూడా టాలీవుడ్ సీనియ‌ర్ హీరో సినిమాలో ఛాన్స్ వ‌స్తే వెంట‌నే ఎస్ అనేసింది. అంతా సంతోషం అనుకున్నారు. ఇదే ఛాన్స్ అనుకుని ఏకంగా రు. 2 కోట్లు డిమాండ్ చేసింద‌ట‌. వెంట‌నే షాక్ తిన్న మేక‌ర్స్ ఆమెను త‌ప్పించేశారు.

ఆ సినిమా ఏదోకాదు ది ఘోస్ట్‌. ఈ సినిమాలో నాగార్జున‌కు జోడీగా ముందు అమ‌లాపాల్‌ను అనుకున్నారు.. అయితే త‌న క్యారెక్ట‌ర్ స‌రిగా లేద‌ని ఆమె నో చెప్పేసింది. ఆ త‌ర్వాత మెహ్రీన్‌ను అడిగితే ఏకంగా రు. 2 కోట్లు డిమాండ్ చేయ‌డంతో హీరోతో పాటు అంద‌రూ షాక్ అయ్యార‌ట‌. చివ‌ర‌కు మెహ్రీన్ షాక్ నుంచి కోలుకుని సోనాల్ చౌహాన్‌ను తీసుకున్నారు.

Latest news