Moviesబరి తెగించిన హైపర్ ఆది..హీరోయిన్ తో పబ్లిక్ గానే ముద్దు..ఏం ఎంజాయ్...

బరి తెగించిన హైపర్ ఆది..హీరోయిన్ తో పబ్లిక్ గానే ముద్దు..ఏం ఎంజాయ్ చేస్తున్నావ్ రా మావ..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వల్గర్ మాటలు.. వల్గర్ డైలాగులు పంచులు.. ఎక్కువైపోతున్నాయి. కచ్చితంగా సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా బీప్ సౌండ్ వేసిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయిపోతుంది .ఇదే స్ట్రాటజీగా మల్చుకొని బుల్లితెరపై కామెడీ చేసే కమెడియన్స్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. వాళ్ళలో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది హైపర్ ఆది. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది పంచ్ వేస్తే దానికి తిరుగు ఉండదు.

అఫ్కోర్స్ దానిలో కచ్చితంగా డబుల్ మీనింగ్ డైలాగులుంటాయి. ఇప్పటికే జబర్దస్త్ షో సగం నాశనం అవ్వడానికి కారణం హైపర్ ఆది అంటుంటే ..అంతటి టీఆర్పి రావడానికి కారణం కూడా హైపర్ ఆది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . ఇది ఇలా ఉండగా హైపర్ ఆది జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో, ఢీ షోలో కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలోనే తాజాగా ఢీ షోలో ఆయన చేసిన కామెడీ కొంచెం నవ్వులు పండించినా చూసే వాళ్లకు మాత్రం చాలా వల్గర్ గా అనిపించింది.

తాజాగా హైపర్ ఆది ఢీ షోలో శ్రద్ధదాసుతో చేసిన ఓవర్ యాక్టింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢీ షోలో డాన్సర్లు అద్భుతమైన డాన్స్ తో పాటు మధ్య మధ్యలో స్కిట్లు కూడా వేస్తారు. హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ , శ్రద్ధా దాస్ నవ్వులు పూయిస్తుంటారు. ఈ సంగతి మనకు తెలిసిందే.. ఈ సందర్భంలోనే హైపర్ ఆది శ్రద్ధ దాస్ యాంకర్ ప్రదీప్ కామెడీ చేయడానికి డిసైడ్ అవుతారు. ఈ స్కిట్లో భాగంగా హైపర్ ఆది శ్రద్ధాదాస్ ను ముద్దు పెట్టమని అడుగుతాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉండే జనాలు షాక్ అయిపోతారు. ఏంటిది హైపర్ ఆది ఇలా అడుగుతున్నాడే అంటూ షా అవుతారు.

దీంతో హైపర్ ఆదికి ముద్దు పెడుతున్నట్లు దగ్గరికి వచ్చి శ్రద్ధాదాస్ చంపపై లాగిపెట్టి కొట్టింది. ఒక్కసారిగా హైపర్ ఆది షాక్ అయ్యాడు. ఏంటి ముద్దు పెడుతుందనుకుంటే దెబ్బ కొట్టింది అంటూ దిమ్మ తిరిగిపోయే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు హైపర్ ఆది. దీంతో మరోసారి మళ్లీ ముందుకు వచ్చి శ్రద్ధ ముద్దు పెట్టు అని అడిగాడు. ఈసారి హైపర్ ఆది ప్రవర్తనకు విసిగిపోయిన శ్రద్ధదాస్ చెస్ట్ పై గట్టిగా పంచులు ఇచ్చింది. దీంతో తల్లడిల్లిపోయాడు అది ..అయితే ఇదంతా స్కిట్లో భాగమే ఆయన ఆడపిల్లతో బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా అంటూ హైపర్ ఆది పై మండిపడుతున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news