Moviesసిమ్రాన్ తన కెరీర్లో ఎంత‌ మంది హీరోలతో ఎఫైర్ నడిపిందో తెలుసా...!

సిమ్రాన్ తన కెరీర్లో ఎంత‌ మంది హీరోలతో ఎఫైర్ నడిపిందో తెలుసా…!

హిందీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తమిళ్ చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపిన హీరోయిన్ సిమ్రాన్. హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నటించిన కూడా ఆమెకు తమిళ తంబిల అభిమానం ఎక్కువగా దక్కింది. ఆమె తమిళ్ ఇండస్ట్రీ లో వి ఐ ఫి సినిమాతో ఎంట్రీ ఇచ్సింది. అబ్బాయి గారి పెళ్లి సినిమాతో సిమ్రాన్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి డెబ్యూ చేసి ఇక్కడ కూడా మంచి హీరోయిన్ గా ఎదిగింది. 2008లో వ‌చ్చిన‌ జాన్ అప్పారావు 40+ ఆమె చివరి సినిమా కావడం విశేషం. బాలయ్య, హరికృష్ణ వంటి హీరోస్ తో ఆమె కెమిస్ట్రీ చక్కగా వర్క్ అవుట్ అయ్యింది.

ఇక సిమ్రాన్ సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే ఆమె పర్సనల్ లైఫ్ లో మాత్రం చాల విశేషాలు ఉన్నాయనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఆమె చాల మంది హీరోస్ అఫైర్స్ నడిపింది అనే వార్తలు అప్పట్లో మీడియాలో చక్కర్లు కొట్టాయి. మరి అందుకో కొన్ని నిజాలు ఉన్న కొన్ని గాసిప్స్ మాత్రమే. మరి సిమ్రాన్ తో ఎఫైర్ అంటూ వచ్చిన ఆ హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం.

కమల్ హాసన్ :
కమల్ హాసన్ తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన సిమ్రాన్ అతడితో కొన్నాళ్ల పాటు ప్రేమలో విహరించింది. కమల్ మాయాజాలంలో పడని హీరోయిన్ ఎవరు ఉంటారు చెప్పండి. అందరి హీరోయిన్స్ లాగానే సిమ్రాన్ కూడా చివరి హర్ట్ అవ్వాల్సి వచ్చింది. వీరిద్దరి మధ్య 22 ఏళ్ళ ఏజ్ గాప్ ఉన్నప్పటికీ పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు చాలానే వచ్చాయి. చివరికి అన్ని కథల్లాగే వీరి ప్రేమ కథ కూడా కంచికి చేరింది.

అబ్బాస్ :
సిమ్రాన్ మొదటి తమిళ సినిమా నుంచి అబ్బాస్ తో మంచి పరిచయం ఉంది. వీరిద్దరూ కొన్ని సినిమాల్లో కలిసి నటించగా పూచుడవ సినిమా టైం లో మాత్రం ఈ వార్తలకు బాగా ప్రచారం పెరిగింది. కానీ సిమ్రాన్ ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం మాట్లాడుతూ వారిది కేవలం స్నేహం మాత్రమే అని కొట్టి పారేసింది.

అజిత్ :
వాలి సినిమాలో కలిసి నటిస్తున్న సమయంలో అజిత్, సిమ్రాన్ ప్రేమలో పడ్డారని అంత అంటూ ఉంటారు. ఈ విషయాన్నీ ఇద్దరు ఖండించకపోవడంతో నిజమే అని వార్తలు పుట్టుకచ్చాయి. అయితే షాలిని ఎంట్రీతో అజిత్ సిమ్రాన్ పట్టించుకోకపోవడంతో వీరి బంధం ముగిసిపోయిందని ఒక గాసిప్ ఉండేది.

బాలకృష్ణ :
ఇక తెలుగు లో ఎక్కువగా బాలకృష్ణ సినిమాల్లో నటించిన సిమ్రాన్, బాలయ్య తో ఆన్ స్క్రీన్ రొమాంటిక్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకుంది. బాలయ్య బాబుతో సమారా సింహ రెడ్డి, నరసింహ నాయుడు, గొప్పింటి అల్లుడు , సీమ సింహం వంటి సినిమాల్లో కలిసి నటించింది. ఈ సినిమాల్లో నటిస్తున్న క్రమం లో వీరిద్దరి మధ్య ఎదో ఉందంటూ కొన్ని వార్తలు రావడం విశేషం. అవి నిజామా కాదా అనే విషయం తెలియకపోయిన సిమ్రాన్, బాలయ్య బాబు కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు రావడం వల్ల ఈ వార్తలకు బలం చేకూరింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news