Moviesనా పెళ్ళాం సపోర్ట్ చేయలా.. అందుకే పవిత్రని అడిగా.. నరేష్ కామెంట్స్...

నా పెళ్ళాం సపోర్ట్ చేయలా.. అందుకే పవిత్రని అడిగా.. నరేష్ కామెంట్స్ వైరల్‌..!?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ వ్యవహారం ఎంత వైరల్ గా మారిందో మనకు తెలిసిందే. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చేసి ..మూడో భార్యకు సైతం విడాకులు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు . అంతేకాదు ఆమెకు విడాకులు ఇచ్చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లొకేషన్ ని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకొచ్చారు.

ప్రజెంట్ ఈ జంట లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది . కాగా వీళ్ళకి సంబంధించిన వ్యవహారం వీళ్ళకి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి . రీసెంట్గా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి” అనే సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పవిత్ర లోకేష్ , నరేష్ స్వయంగా వీడియో ద్వారా జనాలకు కృతజ్ఞతలు తెలియజేసారు.

” ఈ సినిమా ఇంత మంచి హిట్ చేసినందుకు థాంక్స్ అని , కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా జనాల ఆదరిస్తారని చెప్పుకొచ్చారు”. అయితే ఈ వీడియోలో నరేష్ పవిత్ర లోకేష్ భుజంపై చేయి వేసి మాట్లాడటం వైరల్ గా మారింది. ఆలీ ఇంటర్వ్యూలో మాట్లాడిన నరేష్ మరోసారి సంచలన కామెంట్స్ చేసారు. ఆయన మాట్లాడుతూ..” నా భార్య సపోర్ట్ చేయనందుకే ..పవిత్ర లోకేష్ సపోర్ట్ చేసిందని ..నేనే పవిత్ర లోకేష్ ను అడిగానని.. ఆమె ఓకే చెప్పిందని చెప్పుకొచ్చాడు”. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి .

ఆఫ్ కోర్స్ అవి సినిమాలో పాత్రలు అయినప్పటికీ వాళ్ళ నిజ జీవితం కూడా ఆ సినిమా క్యారెక్టర్లకు దగ్గరగా ఉండడంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో టాప్ టృఎండింగ్ లో దూసుకుపోతుంది . చూద్దాం వీళ్ళ రిలేషన్ ఎంతవరకు వెళ్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news