Moviesబాల‌య్యను క‌లిసేందుకు వాగులోకి దూకేసిన అభిమాని.. షాక్‌లో న‌ట‌సింహం (వీడియో)

బాల‌య్యను క‌లిసేందుకు వాగులోకి దూకేసిన అభిమాని.. షాక్‌లో న‌ట‌సింహం (వీడియో)

బాల‌య్య అంటేనే ఊర‌మాస్‌… ఊర‌మాస్ అంటే మా బాల‌య్యే అన్న‌ట్టుగా ఉంటుంది ఆయ‌న‌పై అభిమానులు చూపించే అభిమానం. బాల‌య్య సినిమాల‌కు థియేట‌ర్ల‌లో మాస్ జ‌నాలు ఊగిపోతూ ఉంటారు. ఇక తెర‌మీద బాల‌య్య‌ను చూసిన‌ప్పుడు, బాల‌య్య డైలాగులు చెపుతున్న‌ప్పుడే ఊగిపోయే ఫ్యాన్స్ బాల‌య్య నిజంగా క‌నిపిస్తే ఎలాంటి ర‌చ్చ చేస్తారో చెప్ప‌క్క‌ర్లేదు.

బాల‌య్య‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగాల‌ని అభిమానులు ఆరాట‌ప‌డుతూ ఉంటారు. ఇందుకోసం వాళ్లు చుట్టూ వంద‌లాది మంది క్రౌడ్ ఉన్నా తోసుకుపోతుంటారు. ఇక బాల‌య్య‌ను ద‌గ్గ‌ర నుంచి చూసేందుకు ఓ వీరాభిమాని పెద్ద సాహ‌సం చేశాడు. ఈ సాహ‌సం ఇప్పుడు వీడియో రూపంలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. తాజాగా వ‌ర‌ద‌ల‌తో బాల‌య్య ప్రాథినిత్యం వ‌హిస్తోన్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం అత‌లాకుత‌లం అవుతోంది.

దీంతో బాల‌య్య స్వ‌యంగా అక్క‌డే మ‌కాం వేసి మ‌రీ సేవా కార్య‌క్ర‌మాలు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ వాగు వద్ద కూలిపోయిన వంతెన బాల‌య్య ప‌రిశీలిస్తున్నారు. ఆ స‌మ‌యంలో వాగు చాలా ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. వంతెన‌కు అటు వైపు ఉన్న జ‌నాల్లోనుంచి ఓ వీరాభిమాని బాల‌య్య‌ను ద‌గ్గ‌ర నుంచి చూసేందుకు వ‌స్తూ వాగులో దూకేశాడు. ప‌లువురు అత‌డిని వారిస్తున్నా వినిపించుకోలేదు.

అలా ఆ వాగులో కొంత దూరం కొట్టుకుపోయాడు. చివ‌ర‌కు ఎలాగోలా క‌ష్ట‌ప‌డి ఒడ్డుకు చేరుకున్నాడు. స‌ద‌రు అభిమాని ఒక్క‌సారిగా దూకేయ‌డంతో బాల‌య్య సైతం ఒక్క‌సారిగా షాక్ అయ్యి అలా చూస్తుండిపోయాడు. అయితే ఆ అభిమాని ఒడ్డుకు చేరుకోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. బాల‌య్య‌ను అభిమానించే వీరాభిమానులు ఎంత రిస్క్ అయినా చేస్తార‌నేందుకు ఈ సంఘ‌ట‌నే నిద‌ర్శ‌నం.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news