Moviesబిగ్ బ్రేకింగ్‌: #NBK 107 టైటిల్‌పై పూన‌కాలు తెప్పించే న్యూస్ వ‌చ్చేసింది..!

బిగ్ బ్రేకింగ్‌: #NBK 107 టైటిల్‌పై పూన‌కాలు తెప్పించే న్యూస్ వ‌చ్చేసింది..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ అఖండ త‌ర్వాత న‌టిస్తోన్న సినిమా ఎన్బీకే 107. మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. పైగా అదే సంక్రాంతికి మెగాస్టార్ చిరు న‌టిస్తోన్న వాల్తేరు వీర‌య్య ( చిరు 154) కూడా రిలీజ్ అవుతుంద‌న్న వార్త‌ల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పొంగ‌ల్‌కు బాల‌య్య వ‌ర్సెస్ చిరు మ‌ధ్య బిగ్గెస్ట్ క్లాష్ త‌ప్పేలా లేదు.

ఇక బాల‌య్య 107 షూటింగ్ చాలా వ‌ర‌కు ఫినిష్ అయ్యింది. ఇప్ప‌టికే ఫిలీం సిటీ షెడ్యూల్‌, క‌ర్నూల్ షెడ్యూల్‌, ఫారిన్ షెడ్యూల్స్ చాలా బాగా వ‌చ్చాయంటున్నారు. గోపీచంద్ మ‌లినేని ఎక్క‌డా రాజీప‌డ‌కుండా భారీ స్థాయిలో అయితే సినిమాను తెర‌కెక్కిస్తున్నాడ‌ని టాక్ వ‌చ్చేసింది. క్రాక్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత గోపీ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇదే.

ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన సినిమా ఫ‌స్ట్ లుక్‌, స్టిల్స్ సినిమాపై ఉత్కంఠ పెంచేస్తున్నాయి. అయితే సినిమా టైటిల్‌, రిలీజ్ డేట్ కోసం నంద‌మూరి, బాల‌య్య అభిమానులు కళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. టైటిల్ ఎప్పుడు వ‌స్తుందా ? అని నిద్ర‌ప‌ట్ట‌డం లేదు బాల‌య్య ఫ్యాన్స్‌కు. అయితే వీరి నిరీక్ష‌ణ‌కు తెర‌దించేశారు. ఈ నెల 21న ఈ సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేయ‌నున్నారు.

టైటిల్‌గా రెడ్డిగారు, వీర‌సింహారెడ్డి, జై బాల‌య్య ఇలా ప‌లు పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. మ‌రి ఈ మూడు టైటిల్స్ పెడ‌తారా ? లేదా మ‌రో టైటిల్‌తో ఉత్కంఠ‌ను బ్లాస్ట్ చేస్తారా ? అన్న‌ది రెండు రోజుల్లో తేలిపోనుంది. ఏదేమైనా టైటిల్ వ‌చ్చేస్తే సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగిపోవ‌డం ప‌క్కా…!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news