Moviesప్రియమణి ని అది వేసుకోమని టార్చర్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..సినిమా మోజులో...

ప్రియమణి ని అది వేసుకోమని టార్చర్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..సినిమా మోజులో అంత పని చేసిందా..?

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా కానీ హీరోయిన్ గా కానీ ఎంటరైన తర్వాత ప్రతి విషయంలోను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఏమాత్రం రాంగ్ స్టెప్పేసిన కెరియర్ సర్వనాశనం అయిపోతుంది. అలా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జీవితాన్ని సరైన మార్గంలో పెట్టిన హీరో , హీరోయిన్లే ప్రజెంట్ స్టార్ హీరోలుగా.. పాన్ ఇండియా హీరోయిన్లుగా మన ముందు రాజ్యం ఏలుతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ప్రియమణి కూడా ఒకరు.

ప్రియమణి పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఎవరే అతగాడు అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బోలెడన్ని సినిమాలు చేసింది . కానీ పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో తగిన గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు కమిట్ అవుతూ చేసిన ప్రతి సినిమాలో వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చిన ప్రియమణి ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ ను తనదైన స్టైల్ లో ప్లాన్ చేస్తూ వెబ్ సిరీస్ లతో.. సినిమాలతో బిజీగా మలుచుకుంది.

ప్రియమణి సినీ కెరియర్ స్టార్టింగ్ లో స్టార్ ప్రొడ్యూసర్ ఆయన సినిమా కోసం బొడ్డు పై టాటూ వేసుకోమని ఫోర్స్ చేశారట. సినిమాలోని క్యారెక్టర్ ఆధారంగా మోడ్రెన్మ్ లుక్ లో ఉన్న ప్రియమణి క్యారెక్టర్ లో మరింత ఇన్వాల్వ్ అవ్వాలని ..అలాగే స్క్రీన్ పై పస కనిపించాలని ప్రియమణి బొడ్డుపై టాటూ వేసుకోమని చెప్పాడట. అయితే ప్రియమణి దానికి నిరాకరించిందట. అంతేకాదు..” సినిమా కధ చెప్పిన్నప్పుడే మీరు ఈ విషయం చెప్పుంటే అప్పుడే రిజెక్ట్ చేసే దాని అంటూ.. ఇప్పుడు మీరు ఇచ్చిన రెమ్యూనరేషన్ ని వెనక్కి తీసేసుకోండి ..నాకు ప్రాబ్లం లేదు అంటూ ముఖం మీద చెప్పేసిందట. అంతలా తను చేసే పనిలో ఫుల్ క్లారిటీతో ఉంటుంది ప్రియమణి . ప్రజెంట్ పుష్ప సినిమాలో కూడా స్పెషల్ రోల్ లో కనిపించిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన కెరియర్ ని.. పక్క ప్లానింగ్ తో ముందుకు తీసుకెళ్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news