MoviesUnstoppable 2: ఫస్ట్ గెస్ట్ గా విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్..!?

Unstoppable 2: ఫస్ట్ గెస్ట్ గా విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్..!?

నందమూరి బాలకృష్ణ కెరియర్ లోనే ఫస్ట్ టైం హోస్ట్ గా చేసిన షో అన్ స్టాపబుల్. ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో ప్రసారమైన ఈ క్రేజీ షో అభిమానులను మరింత ఆకట్టుకుంది . ఎవరు ఊహించిన విధంగా అల్లు అరవింద్ బాలయ్యను హోస్టుగా మార్చేయడం ..సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనంగా మారింది . అంతేకాదు బాలయ్య ఏ మాత్రం తడబడకుండా తప్పటి అడుగు వేయకుండా హోస్ట్ గా తన బాధ్యతలను 100% సక్సెస్ అయ్యాడు. దీంతో అన్ స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ అయి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

కాగా అన్ స్టాపబుల్ సీజన్ వన్ షో సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది . ఈ షో కంప్లీట్ అయినప్పటి నుంచి అభిమానులు అన్ స్టాప్ ఫుల్ టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేశారు అయితే కొద్దిరోజుల క్రితమే ఈ షో కి సంబంధించిన అఫీషియల్ డీటెయిల్స్ ను ప్రకటించింది ఈ షోకు మొదటిసారిగా వ్యవహరించిన బాలకృష్ణ రెండు సీజన్ కి కూడా హోస్టుగా చేయబోతున్నట్లు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. అయితే మొదటి సీజన్లోకి వచ్చిన గెస్ట్ లని మించిపోయి స్టార్ సెలబ్రెటీస్ సీజన్ 2 కి తీసుకోరావాలి ప్రయత్నిస్తుంది ఆహా.

ఈ క్రమంలోని అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ఫస్ట్ గెస్ట్ గా ఓ హీరోయిన్ ని పిలవాలని అల్లు అరవింద్ ఫిక్స్ అయ్యాడట. ఆమె మరి ఎవరో కాదు అక్కినేని మాజీ కోడలు సమంత. ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఫస్ట్ ఎపిసోడ్ కు సమంతను తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ అందుతున్న సమాచారం ప్రకారం సమంత ఈ షో కి రావడానికి ఇంట్రెస్ట్ చూయించట్లేదట. అంతేకాదు ఒకవేళ ఆమె రాకపోతే ఈమె ప్లేస్ లో ఫస్ట్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చి ఆలోచనలో ఉన్నారట టాఇం. ఒకవేళ పవన్ కూడా రాకపోతే ఇక అప్పుడు మొదటి గెస్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారట. మరి చూడాలి అన్ స్టాపబుల్ షో సీజన్ 2 కి ఫస్ట్ గెస్ట్ హీరోయిన్ రాబోతుందా..? హీరో రాబోతున్నాడా..? తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news