Moviesప్లీజ్..ఆ హీరో తో లిప్ లాక్ సీన్ చేయించండి..స్టార్ హీరోయిన్ మాటలకి...

ప్లీజ్..ఆ హీరో తో లిప్ లాక్ సీన్ చేయించండి..స్టార్ హీరోయిన్ మాటలకి డైరెక్టర్ షాక్..!?

ఈ మధ్యకాలంలో సినిమాలో రొమాంటిక్ సీన్స్ మరీ ఎక్కువగా అయిపోయాయి. ఒకప్పుడు సమయానుసారం సందర్భానికి తగ్గట్టు అలాంటి సీన్స్ పెడితే.. ఇప్పుడు డైరెక్టర్లు అలాంటి సీన్స్ బేస్ చేసుకుని సినిమా స్టోరీ నే రాసుకొస్టున్నారు అలా తగలాడింది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ఏం చేద్దాం? కొత్త డైరెక్టర్ల హవా నడుస్తుంది. ఇండస్ట్రీలో పాత డైరెక్టర్స్ కథలు బోర్ కొట్టాయి జనాలకి. ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్స్ యంగ్ బ్లడ్ ని ఉడికించే విధంగా సీన్స్ తీస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఓ స్టార్ డైరెక్టర్ కి హీరోయిన్ పెట్టిన స్పెషల్ రిక్వెస్ట్ తో దిమ్మతిరిగిపోయింది. అంతేకాదు వన్డే షూటింగ్ మొత్తం ఆపేసాడట స్టార్ట్ డైరెక్టర్. ఇంతకీ ఆ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా..?

స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమాలను లెక్కలు అర్థమయ్యే అంత క్లియర్ గా తీస్తాడు. ప్రతి సినిమాలో తనదైన స్టైల్ లో ఏదో ఒక మార్కు పెడుతూనే ఉంటారు. ఖచ్చితంగా సుకుమార్ సినిమా వస్తుందంటే జనాలకి ఒప్పించి ఎంటర్టైన్మెంట్ అందులో మనిషి నేర్చుకో తగ్గ విషయం ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. కాగా సుకుమార్ బన్ని కాంబోలో ఫస్ట్ టైం తెరకెక్కిన సినిమా ఆర్య. ఆ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

బన్నీ కెరియర్ కి మంచి బూస్టప్ ఇచ్చింది ఆ సినిమా . బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో బన్నీతో ఆర్య 2 కూడా తీశారు. అయితే ఆర్య 2 అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. కానీ మంచి మార్కులు వేయించుకున్నాడు బన్నీ ,కాజల్ అగర్వాల్, శ్రద్ధదాస్, నవదీప్. కాగా ఈ సినిమా డైరెక్షన్ టైంలో శ్రద్ధదాస్ సుకుమార్ ని ఓ స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకుందట . మనం గమనించినట్లయితే ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ కి లిప్ కిస్ ఇస్తాడు బన్నీ లిఫ్ట్లో .

నిజానికి ఆ సీన్ ని శ్రద్ధకి పెట్టమని చెప్పిందట హీరోయిన్ . బన్నీ లాంటి హీరోతో అలాంటి సీన్ వస్తే కెరియర్ సెటిలైపోయినట్లే ఖచ్చితంగా పాపులర్ అవుతాను అని అనుకోని శ్రద్ధాదాస్ స్పెషల్ రిక్వెస్ట్ చేసిందంట సుకుమార్ ని. అయితే సుకుమార్ తాను రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే వెళ్లాడని హీరోయిన్ శ్రద్దాదాస్ మాటలకి నవ్వేసి ప్యాకప్ చెప్పేసాడట. అంతే కాదు పక్క రోజు షూటింగ్ కూడా ఆయన రాలేదని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి . అంతేకాదు ఇప్పటికీ శ్రద్ధాదాస్ ఎలాంటి హాట్ ఫోటో షూట్స్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. కానీ హీరోయిన్ గా చెప్పుకునే తగ్గ సినిమాలు మాత్రం శ్రద్ధాకి రావట్లేదు. మరి చూడాలి శ్రద్ధ కోరికను తీర్చే డైరెక్టర్ ఎక్కడున్నాడో ..?బన్నీ ఎప్పుడు ఒప్పుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news