Moviesబిడ్డ కోసం ఏడేళ్ల గ్యాప్..భార్యభర్తలకు కార్తీ చెప్పిన టాప్ సీక్రేట్ ఇదే..!!

బిడ్డ కోసం ఏడేళ్ల గ్యాప్..భార్యభర్తలకు కార్తీ చెప్పిన టాప్ సీక్రేట్ ఇదే..!!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తనదైన స్టైల్ లో నటిస్తూ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ హీరో. మనకు తెలిసిందే హీరో కార్తీ అన్న సూర్య కోలీవుడ్ బడా హీరో. అన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన తమ్ముడు ఈ కార్తి. అయితే సినిమాల ఎంపికల విషయంలో ..సినిమాలు రావడానికి డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకి ఏనాడు కార్తీ పేరు సజిష్ట్ చేయలేదు సూర్య. అందుకే సూర్య రియల్ హీరోగా అభిమానులను సంపాదించుకున్నాడు.

మనకు తెలిసిందే హీరో కార్తీ ,సూర్య చాలా క్లోజ్ గా ఉంటారు. మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు. వీళ్ళని చూస్తే అన్నదమ్ములు అని అనుకోరు..మంచి ఫ్రెండ్స్ అనుకుంటారు. కార్తీ సినిమా లైఫ్ ఎలా ఉన్నా పర్సనల్ లైఫ్ మాత్రం ఫుల్ జోష్ లో సాగిపోతుంది. 2011లో రంజని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కార్తి. వీళ్లది అన్యోన్య దాంపత్యం అంటూ కోలీవుడ్లో చెప్పుకొస్తారు. కార్తీ సతీమణికి 2013లో ఓ పాప పుట్టింది అయితే ఆ తర్వాత వీళ్ళు రెండో బేబీని ప్లాన్ చేసుకోలేదు . ఆ తరువాత దాదాపు ఏడేళ్లకి బేబీని ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. దానికి కారణాలు రీసెంట్ ఇంటర్వ్యులో చెప్పుకొచ్చాడు కార్తి.

” మొదట మేము ఒక బిడ్డ చాలు అనుకున్నాము. కానీ ఆ తర్వాత మాకు రెండో బిడ్డ అవసరం అని రియలైజ్ అయ్యాము” అంటూ తనదైన స్టైల్ లో ఫన్నీగా కామెంట్ చేసాడు. అంతేకాదు..ఒక్క బిడ్డ చాలు అనుకునే వాళ్లకి సజీషన్ కూడా ఇచ్చాడు. ఖచ్చితంగా రెండో బిడ్డ అవసరం ఉంటుంది..ప్లాన్ చేసుకోండి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కార్తీ మణిరత్నం దర్శకత్వంలో” పోనియన్ సెల్వం 1″లో నటిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 30న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news