Moviesమొదటి భార్య కు ఇచ్చిన మాట కోసం ..చివరి నిమిషం వరకు...

మొదటి భార్య కు ఇచ్చిన మాట కోసం ..చివరి నిమిషం వరకు ఆ పని చేసిన కృష్ణం రాజు..హ్యాట్సాఫ్..!!

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు తనదైన స్టైల్ తో తన నటనతో తన డైలాగ్ డెలివరీతో తన కంటి చూపుతో తన కోపంతో కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకున్న సీనియర్ హీరో. నిన్న తెల్లవారుజామున మూడు గంటల 15 నిమిషాలకు తన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా బాధపడుతున్న కృష్ణంరాజుకి పోస్టుకోవిడ్ లక్షణాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారట. దీంతో కోవిడ్ కారణంగా కిడ్నీలు దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ విషయాన్ని చెప్పకుండా రెబెల్ ఫ్యామిలీ తప్పు చేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

కాగా కొద్దిసేపటి క్రితమే కృష్ణంరాజు అంతక్రియలు పూర్తయ్యాయి. ఆయన అంతిమయాత్రకు వేలాది మంది జనాలు తరలివచ్చారు. సినీ ప్రముఖుల సైతం ఆయన అంత్యక్రియలలో భాగమై ఆయనకు తమకు మధ్య ఉన్న స్నేహ బంధాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు . ఈ క్రమంలోనే ప్రభాస్ ని ఆపడం ఎవరి తరం కాలేదు .అంతేకాదు ఆయన భార్య శ్యామలాదేవి కృష్ణం రాజు పాడి మోసి ఆయన పై ఆమెకున్న ప్రేమను నిరూపించుకుంది.

కాగా కృష్ణంరాజుకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది విన్న తర్వాత కృష్ణంరాజుకు హాట్సాఫ్ చెప్తున్నారు ఆయన ఫ్యాన్స్ . మనకు తెలిసిందే కృష్ణం రాజు మొదటి భార్య సీతాదేవి ఒక కార్ యాక్సిడెంట్ లో మరణించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఒంటరి జీవితం గడపలేరని చెప్పి కృష్ణంరాజుకు శ్యామలాదేవితో పెళ్లి చేశారు . శ్యామలాదేవితో హ్యాపీగా ఉన్నా కానీ సీతాదేవి తో కలిసి ఉన్న నాటి మూమెంట్స్ ను ఎప్పుడు షేర్ చేసుకునేవారు కృష్ణం రాజు. అంతేకాదు సీతాదేవికి ఇచ్చిన మాట కోసం చివరి నిమిషం వరకు ఆయన పని చేశాడు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. నిజానికి కృష్ణం రాజుది రాజుల ఫ్యామిలీ సాంప్రదాయాల విషయంలో చాలా కఠినంగా ఉంటారు.

కాగా సీతాదేవి తినేటప్పుడు మొదటి ముద్ద దేవుడికి అంటూ పక్కన పెట్టే అలవాటు ఉందట. అదే క్రమంలో సీతాదేవి కృష్ణంరాజు జీవితంలోకి ఎంటర్ అయ్యాక కృష్ణంరాజు కూడా అలాంటి అలవాటు నేర్పించిందట. మొదటి భార్య చనిపోయింది కదా అని ఆయన పద్ధతిని మార్చుకోలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే మొదటి ముద్ద నా మొదటి భార్యకి అంటూ పక్కన పెట్టేసేవాడట. మరణించే ముందు వరకు కూడా కృష్ణంరాజు అలాగే చేసేవారట. అది ఏ ఈవెంట్ అయినా ..ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే పక్కన పెట్టేసేవాడట .ప్రతి రోజు ఏ రోజు మర్చిపోయావాడు కాదట . ఈ విషయం తెలుసుకున్న కృష్ణంరాజు అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు . ఇంతటి మంచి వ్యక్తిని కోల్పోయాం మనం అంటూ బాధపడుతున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news