Moviesబన్నీ భార్య అంత మాట అనేసింది ఏంటి .. ఏడ్చేసిన అల్లు...

బన్నీ భార్య అంత మాట అనేసింది ఏంటి .. ఏడ్చేసిన అల్లు అర్జున్.. !?

సినీ ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్నా వాళ్ళల్లో అందరికీ ప్రత్యేకం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా కానీ కుటుంబ సభ్యులను ఒప్పించి.. ప్రేమకి కులం అడ్డురాదు అంటూ వీళ్ళిద్దరి పెళ్లి గ్రాండ్ గా చేసుకున్నారు. వీరిద్దరూ ఇప్పుడు ఇద్దరు పిల్లలతో సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. బన్నీ పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే స్నేహ రెడ్డి బన్నీకి సంబంధించిన పనులను పిల్లలు ఆలనా పాలనా చూసుకుంటూ భార్య రోల్ లో మంచి మార్కులు సంపాదించుకుంటుంది.

కాగా..బన్నీ కెరియర్లో డిజాస్టర్ గా నిలిచిన సినిమాలలో ” నా పేరు సూర్య నా ఊరు ఇండియా” అనేది కూడా ఒకటి. ఈ సినిమా ఎంత డిజాస్టర్ టాక్ తెచ్చుకునిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సొంత బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చూడడానికి ఇష్టపడలేదు. కంటెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు బన్నీని ఆర్మీ లుక్ లో చూడలేకపోవచ్చు ..కారణాలు ఏదైనా సరే బన్నీ మాత్రం ఈ సినిమా భారీ దెబ్బేసింది. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ తన భార్య గురించి చెప్పిన మాటలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

బన్నీ “నా పేరు సూర్య నా ఊరు ఇండియా” సినిమా చేసే టైంలో ఆర్మీ గురించి తెలుసుకొని ఆర్మీలో చేరిపోదామని డిసైడ్ అయ్యాడట. ఇదే విషయాన్ని బన్నీ భార్యకు చెప్పాడట. అప్పుడు స్నేహారెడ్డి సెకండ్ కూడా ఆలోచించుకోకుండా..” వెరీ గుడ్ ..కమాన్ గో..” అంటూ చెప్పేసిందట. దీంతో బన్నీ షాక్ అయిపోయి ..”నేను వెళ్ళిపోతే మరి నువ్వు ఏం చేస్తావు.. అక్కడ ఏదైనా జరగొచ్చు.. నేను చనిపోయిన చనిపోవచ్చు ..మరి నీకు ప్రాబ్లం లేదా..? పిల్లల్ని ఎవరు చూసుకుంటారు..? నీకేం బాధ లేదా..?” అంటే ..”నో నాకు అలాంటి బాధలు లేవు .

దేశం కోసమేగా చచ్చిపోతాను అంటున్నవ్.. నాకు ప్రాబ్లం లేదు.. ఆర్మీకి వెళ్లు పిల్లలను నేను చూసుకుంటాను.. ధైర్యంగా ఉంటాను..” అంటూ చెప్పుకొచ్చిందట. ఈ మాటలన్నీ విన్న డైరెక్టర్ కూడా షాక్ అయిపోయాడట. అప్పుడు అర్థమైంది అంటే బన్నికి తన భార్యకు దేశం పట్ల ఎంత ప్రేమ ఉందో అనేది. అంతేకాదు ఆ ఒక్క మాటతో బన్నీ ఎమోషనల్ అయిపోయాడట. ఏ భార్య నిజానికి ఇలా చెప్పదు అంటూ కన్నీరు పెట్టుకున్నారట. దీంతో బన్నీ అభిమానులు ఫాన్స్ కూడా షాక్ అయ్యారు. స్నేహ వదిన సూపర్ అంటూ అప్పట్లో ఆమెను హైలెట్ గా మార్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news