Moviesఇంత హాట్ హాట్‌గా ర‌చ్చ చేస్తోన్న ప‌వ‌న్ హీరోయిన్ అమీషా ప‌టేల్...

ఇంత హాట్ హాట్‌గా ర‌చ్చ చేస్తోన్న ప‌వ‌న్ హీరోయిన్ అమీషా ప‌టేల్ ఏజ్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే…!

సినిమా రంగంలో ఒకప్పుడు హీరోయిన్‌లుగా ఒక వెలుగు వెలిగిన వారంతా వయసు పెరిగాక పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోతూ ఉంటారు. మరికొందరు మాత్రం పెళ్లి అయినా కూడా వెండితెర మీద కనిపించాలన్న కోరికతో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తూ ఉంటారు. అయితే కొందరు నాలుగు పదుల‌ వయసు దాటేసి 50వ వ‌డిలోకి వచ్చినా కూడా పెళ్లికి దూరంగా ఉంటూ ఉంటారు. ఇలాంటి వాళ్లు ఇప్పటికీ తాము ఇంకా లైమ్‌లైట్‌లో ఉన్నామని చూపించుకునేందుకు సోషల్ మీడియాలో సెగలు రేపుతూ హాట్ హాట్ ఫోటోలతో దర్శనమిస్తూ ఉంటారు.

ఇప్పటి కుర్ర హీరోయిన్‌ల‌కు సోషల్ మీడియాలో ఫాలోవర్లు భారీగా ఉంటున్నారు అయితే సీనియర్ హీరోయిన్లు 40 ఏళ్లు దాటుతున్న కూడా సోషల్ మీడియాలో 20 ఏళ్ల కుర్ర భామల్లాగా హాట్ హాట్ గా ఉంటూ రచ్చ చేస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్. అమీషా పటేల్ కు బాలీవుడ్ లోనూ ఇటు సౌత్ ఇండియాలోనూ మంచి క్రేజ్ ఉండేది. హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన కహోనా ప్యార్ హై ( తెలుగులో ప్రియ‌రాలు పిలిచింది ) సినిమాతో అమీషా పటేల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా ఉన్న యూత్ ను పిచ్చపిచ్చగా కట్టిపడేసింది.

ఆ తర్వాత అమీషా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఎన్టీఆర్ తో నరసింహుడు- మహేష్ బాబుతో నాని సినిమాలలోనూ జోడీ కట్టింది. ఆ తర్వాత కొన్నేళ్ల‌పాటు బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన అమీషా నాలుగైదు ఎఫైర్లతో వార్తల్లో కూడా నిలిచింది. ఇప్పుడు ఈ అమ్మడి వయసు 46 సంవత్సరాలు.. అయినా కూడా ఇంకా పెళ్లికి దూరంగా ఉంది. ఓ కాంగ్రెస్‌ రాజ‌కీయ నాయ‌కుడి కొడుకుతో ఎఫైర్ పెట్టుకున్న ఆమె ఆ ఇంటి కోడ‌లు అవుతోంద‌ని కొద్ది రోజులుగా ప్ర‌చారం అయితే ఉంది.

తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో చూస్తే ఎవరైనా షాక్ అయిపోతారు. అమీషా వయసు 46 కాదు జస్ట్ 25 అన్నట్టుగా ఉంటుంది. అయితే ఈ వయసులో అమీషా ఎన్ని అందాలు చూపించిన హీరోయిన్గా ఛాన్స్ అయితే రాదు. మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయిన ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. ఇక అమీషా తెలుగులో చివరిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన పరమవీరచక్ర సినిమాలో కనిపించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news