అర్చన… 80 దశకంలో ఈమె ఒక సంచలనం.. అలా అని ఈమె పెద్ద అందగత్తె కూడా కాదు అలాగని గ్లామర్ క్వీన్ అసలు కాదు. కేవలం తనలోని నటిని మాత్రమే నమ్ముకుని ఇండియన్ స్క్రీన్ ని షేక్ చేసేసింది అర్చన. నిరీక్షణ, మట్టి మనుషులు, దాసి వంటి సినిమాలు అర్చన జీవితంలోనే ఆమెకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టాయి. ఆంధ్రప్రదేశ్ పుట్టిన అర్చన తమిళనాడులో తన చదువులను పూర్తిచేసుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రెండు దశాబ్దాలకు పైగా నటించి రెండు సార్లు ఉత్తమ జాతీయ అవార్డులు కూడా గెలుచుకుంది అర్చన.
అర్చన తన కెరీర్ మొత్తంలో కేవలం ఒకే ఒక హిందీ సినిమా అయిన యాడూన్ కే బరాత్ లో నటించింది. అలాగే గంగాపుర్ అనే ఒక ఇంగ్లీష్ సినిమాలో సైతం నటించింది. తన అభినయం వల్లే అనేక అవార్డులు, రివార్డులు దక్కించుకోగలిగింది. 1988, 89 లలో వరసగా తెలుగు సినిమా దాసికి, తమిళ సినిమా వీడుకి జాతీయ ఉత్తమ నటి గా నిలిచింది. ఇక తెలుగులో లేడీస్ టైలర్, భారత్ బంద్, ఉక్కు సంకెళ్లు వంటి సినిమాలు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి.
అందాల ఆరబోతకు ఎన్నో అవకాశాలు వచ్చినా కేవలం అభినయం ఉన్న పాత్రలలో ఎంచుకుంటూ తన కెరియర్ రెండు దశాబ్దాల పాటు కొనసాగించింది. స్వతహాగా కథక్, కూచిపూడి డాన్సర్ అయిన అర్చన గ్లామర్ కు దూరంగా ఉన్నప్పటికీ నిరీక్షణ వంటి ఒక అద్భుతమైన చిత్రంలో నటించి గ్లామర్ కి, అందాల ఆరబోతకు, అభినయానికి ఉన్న తేడాను చెప్పకనే చెప్పింది. ఈ సినిమాలో జాకెట్ లేకుండా కొన్ని సన్నివేశాల్లో నటించాల్సి రావడంతో సహజత్వం కోసం అర్చన అలాగే నటించింది. అని ఎక్కడ కూడా పాత్ర చెడిపోకుండా, ఎబ్బెట్ గా కనిపించకుండా అర్చన ఈ పాత్రను అద్భుతంగా పోషించింది.
ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమైన అర్చన దాదాపు 10 ఏళ్లపాటు గ్యాప్ తీసుకుంది మళ్లీ 2017లో రీఎంట్రీ ఇస్తూ ఒక సంచలన విషయాన్ని బయట పెట్టింది. మళ్లీ తెలుగు సినిమాలో ఎప్పుడు నటిస్తారు అని అడిగిన ప్రశ్నకు గాను తెలుగులో నటించే ప్రసక్తే లేదు అంటూ కుండ బద్దలు కొట్టింది. అందుకు గల కారణం ఏంటి అని ప్రశ్నించగా తాను తెలుగు సినిమాల్లో నటిస్తున్న క్రమంలో కొంతమంది తనను ఇబ్బందులకు గురి చేసినట్లుగా బయటపెట్టింది కానీ ఆ వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని బహిర్గతం చేయకపోయినా… తెలుగు సినిమాల్లో నటించడం ఇష్టం లేదు అంటూ చెప్పేసింది. 80 దశకంలోలో దొరికిన అర్చనలాంటి ఆణిముత్యం తెలుగు తెరకు దూరం కావడం ఒక రకంగా బాధాకరమే చెప్పాలి.