యస్.. ఈ బొద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతుందా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా..ఇప్పటికి హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ..హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ..త్వరలోనే పెళ్లి చేసుకుని..ఓ ఇంటిది కాబోతుందట. అల్లు అర్జున్ హీరో గా నటించిన దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బబ్లీ బ్యూటీ హన్సిక.. ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ టైం పాస్ చేస్తూ వస్తోంది.
తెలుగులో అలా మెరిసి ఇలా కనుమరుగైన ఈ అమ్మడు..కోలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అలాగే బడా హీరోలతో రాసుకుని పూసుకుని తిరిగి..మీడియాలో హెడ్ లైన్స్ లో నిలిచింది. కాగా ఆ మధ్య ఫేడవుట్ హీరోయిన్గా తెలుగులో కనబడకుండా పోయిన హన్సిక.. ఇప్పుడు మళ్లీ చేతికి వచ్చిన కొన్ని సినిమాలు చేస్తోంది. తెలుగులో అమ్మడు ఫాలోయింగ్ ఎలా ఉన్నా.. తమిళంలో మాత్రం ఈ పాపకు అదిరిపోయే ఆఫర్లతో రచ్చ చేస్తోంది. ఇక ఇప్పుడు అమ్మడికి పెళ్లి పై గాలి మళ్లింది అనుకుంటా..పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది.
కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..హన్సిక త్వరలో నే పెళ్లి చేసుకోబోతుందట. అది కూడా ఓ బడా పొలిటీషియన్ కొడుకుని. ఇన్నాళ్లు స్టార్ హీరోల కొడుకులతో అఫైర్ నడిపిదంటూ వచ్చిన వార్తలు మొత్తం పక్కన పెట్టేస్తూ.. ఫ్రేష్ గా పొలిటీషియన్ కొడుకుని పెళ్ళి చేసుకోబోతుందట. అది కూడా మంచి పలుకుబది ఉన్న ఫ్యామిలీ అన్నట్లు తెలుస్తుంది. ఆ ఇంటికి హన్సిక పెద్ద కోడలు గా అడుగుపెడుతుందట. ఇప్పటికి మాటలు మాట్లాడేసుకున్న ఇరు కుటుంబాలు..త్వరలోనే నిశ్చితార్ధపు విషయాలను అఫిషీయల్ గా చెప్పనున్నారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు మంచి సౌండ్ పార్టీనే పట్టింది జన్సిక పాప..!?