టాలీవుడ్ యంగ్‌హీరో అక్కినేని నాగచైతన్య వరుస విజయాలకు తాజాగా వచ్చిన థ్యాంక్యూ సినిమా బ్రేక్ వేసింది. చైతుకు వరుసగా నాలుగు హిట్లు పడ్డాయి. అయితే థ్యాంక్యూ మాత్రం ఘోరంగా తన్నేసింది. థ్యాంక్యూ నిరాశపరిచినా కొద్ది రోజుల్లోనే మరో సినిమాతో చైతు మన ముందుకు వస్తున్నాడు. బాలీవుడ్‌లోకి చైతు ఎంట్రీ ఇస్తోన్న ఫస్ట్ సినిమా లాల్‌సింగ్ చద్దా. మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ – కరీనా కపూర్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో చైతు నటిస్తుండడంతో పాటు తెలుగులో గీతా ఆర్ట్స్ రిలీజ్ చేస్తుండడం, మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా సమర్పిస్తుండడంతో ఇక్కడ కూడా బజ్ బాగానే ఉంది. చైతుకు ఇది బాలీవుడ్లో డెబ్యూ మూవీ కావడంతో ప్రమోషన్లలో బాగానే కష్టపడుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో చైతు తన సినిమా, వ్యక్తిగత జీవితంతో పాటు సమంతతో ప్రేమ, పెళ్లి గురించి కూడా ఓపెన్ అప్ అవుతున్నాడు.
ఈ క్రమంలోనే ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో ఒక్కొక్కరి గురించి ఆసక్తికర ఆన్సర్లు ఇచ్చాడు. విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే క్రేజీ అని చెప్పాడు. ఇక రాశీఖన్నా పేరు చెప్పిన వెంటనే ఆమె మంచి ఫ్రెండ్ అని చెప్పాడు. ఇక బంగార్రాజు సినిమాలో తనతో పాటు నటించిన కృతిశెట్టి గురించి చెపుతూ ఆమె చిన్న పాప అని చెప్పాడు. ఇక శోభిత ధూళిపాళ్ల పేరు చెప్పిన వెంటనే చైతు పకపకా నవ్వేశాడు.
ముందు సైలెంట్‌గా ఉంటూనే తర్వాత నవ్వేశాడు. శోభిత పేరు వింటే తాను నవ్వుతాను అని చెప్పాడు. ఎందుకంటే సామ్‌తో విడాకుల తర్వాత చైతు – శోభితతో డేటింగ్లో ఉన్నాడని.. వీరిద్దరు హైదరాబాద్‌లో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని.. వీరు త్వరలోనే పెళ్లి చేసుకోవచ్చన్న పుకార్లు గట్టిగానే వచ్చాయి. ఈ రూమర్లపై చైతు మాత్రం ఎప్పుడూ స్పందించలేదు.
అయితే చైతు తల్లి శ్రీలక్ష్మి మాత్రం చైతుకు మళ్లీ పెళ్లి చేసేందుకు ఒప్పించే ప్రయత్నాల్లో ఉందనే అంటున్నారు. లాల్‌సింగ్ చద్దా షూటింగ్ స్పాట్‌కు కూడా ఆమె ఇదే విషయమై చైతుతో మాట్లాడేందుకు ఎక్కువుగా వెళ్లిందని టాక్ ? ఆ ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.