బాలీవుడ్లో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో చిన్న రోల్ చేసిన విజయ్..ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారాడు. డీసెంట్ హిట్ అందుకున్న విజయ్ ఆ తర్వాత ద్వారక, అర్జున్ రెడ్డి, టాక్సీ వాలా సినిమాలు చేశాడు. వీటిలో టాక్సీవాలా ముందు రావాల్సి ఉంది. కానీ, ఓవర్ బడ్జెట్ వల్ల ఆ సినిమాను విడుదల కాకుండా ఆపేశారు. అదే సమయంలో ద్వారక వచ్చి ఫ్లాప్‌గా నిలిచింది.
దాంతో ఇక విజయ్ హీరోగా ఏం పనికొస్తాడో అనుకున్నారు. దానికి ఫుల్ స్టాప్ గీత గోవిందం లాంటి క్లాస్ హిట్ అలాగే, అర్జున్ రెడ్డి లాంటి మాసీవ్ హిట్ అందుకున్నాడు. రెండు సినిమాలలో విజయ్ పోషించిన పాత్రలు పూర్తిగా వేరే. రెండు సినిమాలు భారీ హిట్. అయితే, విజయ్‌కి అర్జున్ రెడ్డి సినిమా తెచ్చిన మైలేజ్ అసాధారణం. ఇప్పటికే అదే యాటిట్యూడ్ ఇప్పటకీ మేయింటైన్ చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నటించిన నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకి అదే ఫార్ములా ఫాలో అయ్యాడు.
అయితే, ఇవన్నీ అట్టర్ ఫ్లాప్‌గా మిగిలాయి. అయినా విజయ్‌ని అర్జున్ రెడ్డి సినిమా క్రేజ్‌తోనే చూస్తున్నారు. బాలీవుడ్లో ఈ సినిమా తర్వాత విజయ్ వెనకాల పడిన యంగ్ బ్యూటీస్ లిస్ట్ చాలా ఉంది. అంతేకాదు, మన తెలుగు సినిమాలలో నటిస్తున్న హీరోల కంటే బాలీవుడ్ భామలకే ఎక్కువ ఆరాటం పెరిగింది. ఇక్కడ సమంత, రష్మిక మందన్న లాంటి వారు విజయ్ సరసన నటించాలని ఎంత ఉత్సాహంతో ఉన్నారో అంతకు మించి బాలీవుడ్ యంగ్ బ్యూటీలున్నారు.
లైగర్ సినిమాలో విజయ్ సరసన నటించిన అనన్య పాండే చాలా ఊహించుకుంది. సౌత్‌లో విజయ్ క్రేజ్ తనకీ ఉపయోగపడుతుందనుకుంది. ఇక్కడ లైగర్ మంచి లాంచింగ్ మూవీ అనుకుంది. అనన్య మాత్రమే కాదు, అక్కడ ఉన్న యంగ్ హీరోయిన్స్ కూడా విజయ్ అంటే పడిచస్తున్నారు. అయితే, లైగర్ రిజల్ట్‌తో అనన్య పాండేకి గట్టి షాక్ తగిలింది.
అనవసరంగా ఈ సినిమా చేసినట్టు ఇప్పుడు ఫీలవుతోంది. అనన్య మాత్రమే కాదు, విజయ్ అంటే పడి చస్తున్న బాలీవుడ్ బ్యూటీస్ కూడా తన సినిమాలో ఛాన్స్ అంటే ఆలోచించే పరిస్థితి వచ్చిందంటున్నారు. మరి ఇప్పుడైనా విజయ్ తన యాట్యిట్యూడ్ను పూర్తిగా పక్కన పెట్టేసి మంచి కథాబలం ఉన్న సినిమాలు ఎంచుకుంటే బావుంటుంది..అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.