Moviesకెరీర్ లో ఎంత మంది తో నటించిన బాలకృష్ణ కు నచ్చిన...

కెరీర్ లో ఎంత మంది తో నటించిన బాలకృష్ణ కు నచ్చిన ఇద్దరు హీరోయిన్స్ వీళ్లే..ఎందుకంటే..!!

నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఈ పేరు గురించి కొత్త ఇంట్రడక్షన్ అవసరం లేదు. నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకోని ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయిన బాలకృష్ణ మొదటి సినిమా నుండి తనలోని వైవిధ్యమైన టాలెంట్ తో అభిమానులను ఉత్సాహ పరుస్తూనే వచ్చాడు. మనకు తెలిసిందే బాలయ్యకు కోపం ఎక్కువ.. ప్రేమ కూడా ఎక్కువే.. ఓ మనిషి తప్పు చేస్తే కొట్టడానికి పైకి ఎత్తిన చెయ్యి అదే మనిషి మంచి పని చేస్తే అభినందించడానికి భుజం తట్టుతాడు అలాంటి క్యారెక్టర్ బాలయ్యది.

 

కాగా బాలయ్య తన కెరీర్లో బోలెడు మంది హీరోయిన్స్ తో నటించాడు. కానీ బాలయ్య నటించిన హీరోయిన్లలో ఆయనకు కంఫర్ట్ గా అనిపించింది.. ఆయన మళ్ళీ మళ్ళీ చేయాలి అనుకుంది ఇద్దరే ఇద్దరు హీరోయిన్స్ తో నట . ఈ విషయం ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వాళ్ళు ఎవరో కాదు అందాల బ్యూటీ సిమ్రాన్.. హాట్ బ్యూటీ నయనతార.

తెరపై సిమ్రాన్ బాలయ్య జోడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళ బొమ్మ పడితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. ఇప్పటివరకు వీళ్ల కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. వీళ్లిద్దరి మధ్య రొమాన్స్ కూడా సూపర్ గా ఉంటుంది. ఇక ఆ తర్వాత అంత బాగా జోడి కుదిరింది బాలయ్యకు అంటే ..అది నయనతార అనే చెప్పాలి. సింహ సినిమాలో వీళ్ళు నటించిన విధానం తెర పై కెమిస్ట్రీ ఎంత అద్భుతంగా ఉందో చెప్పనవసరం లేదు.

ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే అందరూ ఎంజాయ్ చేస్తూ చూస్తారు. అంత బాగా నటించారు ఈ జంట. ఇక మళ్ళీ నయనతార తర్వాత బాలయ్యకు ఆ రేంజ్ జోడి దొరకలేదని చెప్పాలి. ప్రజెంట్ బాలయ్య గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో NBK107 ..ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో NBK108 సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news