నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా మాస్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లో ప్రతిష్టాత్మకంగా 107వ సినిమాగా వస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ వాళ్లు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. క్రాక్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మలినేని గోపీచంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రీ మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, స్టిల్స్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది.
ఖచ్చితంగా అఖండ తర్వాత వెంటనే బాలయ్య కెరీర్లో మారో మాసీవ్ బ్లాక్‌బస్టర్ పడుతుందన్న అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి గత కొంత కాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర విషయాలే బయటకు వస్తున్నాయి. ఈ సినిమాను ముందు దసరాకు రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే బాలయ్యకు కరోనా రావడంతో షూటింగ్‌కు పది రోజులు బ్రేక్ పడింది.
ఇక ఇప్పుడు డిసెంబర్లో రిలీజ్ అనుకున్నా.. డిసెంబర్ కన్నా సంక్రాంతి బరిలో ఉంటే బాగుంటుందనే మేకర్స్ భావిస్తున్నారట. జై బాలయ్య అన్న టైటిల్ పరిశీలిస్తోన్న ఈ సినిమా రిలీజ్ కోసం ఓ డేట్ కూడా లాక్ చేసినట్టుగా నయా రూమర్స్ వినిపిస్తున్నాయి. 2023 జనవరి 12న ఈ క్రేజీ మాసీవ్ మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా సమాచారం బయటకు వచ్చింది.
అయితే ఇప్పుడు అదే నిజమైతే బాలయ్యకు బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ తప్పదు. ప్రభాస్ నటించిన భారీ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ఇప్పటికే పలు వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశారు. ఇద్దరిలో ఎవ్వరూ వెనక్కు తగ్గకపోతే బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ తప్పదు.
మరో ట్విస్ట్ ఏంటంటే సంక్రాంతికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 154వ సినిమా వాల్తేరు వీరయ్య కూడా లైన్లో ఉంది. మరి ఈ మూడు సినిమాలు కూడా సంక్రాంతికి వస్తే బాక్సాఫీస్ వార్ హీటెక్కిపోవడం ఖాయమనే చెప్పాలి. మరి వీరిలో ఎవరు వెనక్కు తగ్గుతారు.. ఎవరు ముందుకే ఉంటారో ? చూడాలి. ఏదేమైనా ప్రభాస్, బాలయ్య క్లాష్ అయితే ఇంట్రస్టింగ్‌గానే ఉంది.