Moviesఅలాంటి తప్పుడు పనులు నేను చేయను..రష్మిక, పూజా పరువు తీసేసిన అనుపమ..!?

అలాంటి తప్పుడు పనులు నేను చేయను..రష్మిక, పూజా పరువు తీసేసిన అనుపమ..!?

హీరోయిన్ అనుపమ పరమేశ్వరణ్.. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. తన వైవిధ్యమైన నటనతో ..అద్భుతమైన టాలెంట్ తో ..సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్ట్ చేసిన అ ఆ సినిమాతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ ..ఆ తరువాత బోలెడు సినిమాలో నటించి తనకంటూ సెపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అనుపమ పరమేశ్వరణ్ చెప్పుకోదగ్గ క్వాలిటీ అంటే ఎలాంటి క్యారెక్టర్ నైనా సరే ఇట్టే తనకు తగ్గట్టు మార్చుకొని ఆ పాత్రలో ఇమిడిపోయి నటిస్తుంది. అది బాయ్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ గా అయినా సరే.. అతిధి పాత్ర అయినా సరే.. ఓ తండ్రికి కూతురుగా అయినా సరే.. ఎలాంటి రోల్ అయినా సరే.. ఈ పాత్రకు అనుపమ నే కరెక్ట్ మిగతా వారు ఈ పాత్ర చేస్తే చూడలేం రా బాబు అన్నట్లు అనిపిస్తుంది.

అందుకోసమే కాబోలు అనుపమ పరమేశ్వరణ్ కు ఇప్పటికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. నిజం చెప్పాలంటే ఇంతవరకు అనుపమ పరమేశ్వరుణ్ కి బ్లాక్ బస్టర్ హిట్టు కూడా పడలేదు . కానీ అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఏం మాత్రం తీసుపోదని చెప్పకు తప్పదు. రీసెంట్ గా కార్తికేయ 2 తో భారీ బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకున్న అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా చేసిన కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా సరే ఆ సినిమాకి అభిమానుల నుంచి కచ్చితంగా రివ్యూ తీసుకుంటుంది. తనలోని తప్పులను సరి చేసుకొని తన తదుపరి సినిమాకు ఆ తప్పు జరగకుండా జాగ్రత్త తీసుకుంటుంది. అందుకే అనుపమ పరమేశ్వరన్ కు ఏ విషయమైనా సరే అభిమానులు మొహమాటం లేకుండా చెప్పేస్తారు. కాగా రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన అమ్మడు ..”కార్తికేయ టు తర్వాత మీరు ఎలాంటి రోల్స్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు.. అందరు హీరోయిన్ లాగే కమర్షియల్ హిట్ కోసం చూస్తారా..?” అని ఓ నెటిజన్ అడగ్గా ..అనుపమ పరమేశ్వరన్ మైండ్ బ్లాకింగ్ ఆన్సర్ ఇచ్చింది .

అను మాట్లాడుతూ..” నేను హీరోయిన్ గా చేసే సినిమాల స్టోరీ ని చూస్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా గమనించేది కథ. కథలో నా పాత్ర.. నా పాత్ర కథకి ఎంత న్యాయం చేయగలుగుతుంది. అంతేకానీ హీరో భజన చేస్తూ హీరో తానా అంటే తందనానా అంటూ హీరో చుట్టూ తిరిగే హీరోయిన్ పాత్ర ఉన్న క్యారెక్టర్స్ నాకు వచ్చిన నేను చెయ్యను. అలాంటి తప్పుడు నిర్ణయం నేను ఎప్పటికీ తీసుకోను. నా వరకు హీరోయిన్ అంటే కచ్చితంగా నటన పరంగా మెప్పించగలగాలి. కథలో కాస్తయినా ఆమెకు బలం ఉండాలి. అప్పుడే నేను హీరోయిన్ గా చేస్తాను “అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది .

ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే కొందరు నెటిజన్స్ అనుపమ మాటలను రష్మిక మందన పూజ హెగ్డే కు ట్యాగ్ చేస్తూ..” అను మాటలని విన్నారా మీరు ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే మీ కెరియర్ బాగుపడుతుంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో అను మాట్లాడిన మాటలను పరోక్షంగా రష్మిక పూజ హెగ్డే లపై ప్రభావం చూపినంట్లైంది. అది నిజమే రష్మిక మందన పూజ హెగ్డే ఇప్పటివరకు చేసిన పాత్రలన్నీ అలాంటివే. హీరో చుట్టూ తిరగడమే.. హీరో భజన చేయడమే.. ముద్దులు పెట్టుకోవడమే అంతే ..సో దీంతో అనుపమ మాట్లాడిన మాటల్లో తప్పు లేదని అంటున్నారు ఆమె అభిమానులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news