Moviesమ‌హేష్ ' నాని ' సినిమాతో అమీషాప‌టేల్‌కు ఇంత అవ‌మానం జ‌రిగిందా...!

మ‌హేష్ ‘ నాని ‘ సినిమాతో అమీషాప‌టేల్‌కు ఇంత అవ‌మానం జ‌రిగిందా…!

బాలీవుడ్‌లో కహోనా ప్యార్ హై సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అమీషా పటేల్ మొదటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. బాలీవుడ్ సినిమా అందులోనూ మొదటి సినిమా..పెద్ద నిర్మాణ సంస్థ..ఆ నిర్మాత కొడుకే హీరో. అతనే హృతిక్ రోషన్. అందుకే, కావాల్సిన దానికంటే ఎక్కువ ఎక్స్‌ఫోజింగ్ చేసి అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది అమీషా. ఇలాంటి హీరోయిన్స్‌ని టాలీవుడ్‌కి తీకురావాలంటే స్టార్ డైరెక్టర్ వల్లనే అవుతుంది.

అలాంటిది మొదటి సారి మెగా ఫోన్ పట్టుకుంటూ ఆ ధైర్యం చేశాడు పూరి జగన్నాథ్. పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకుడిగా మారుతూ చేసిన మొదటి సినిమా బద్రి. రేణు దేశాయ్ మరో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ సినిమాలో అటు అమీషా పటేల్, ఇటు రేణూ దేశాయ్ తమ గ్లామర్ పర్ఫార్మెన్స్‌తో బాగా ఆకట్టుకున్నారు. దాంతో మొదటి సినిమా తర్వాత రేణు దేశాయ్ హీరోయిన్‌గా కొనసాగకపోయినా అమీషాని మాత్రం మరికొన్ని సినిమాలకు తీసుకువచ్చారు.

ఆ సినిమాలే నరసింహుడు, నాని. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా అగ్ర దర్శకుడు బి గోపాల్ రూపొందించిన నరసింహుడు భారీ అంచనాల మధ్య విడుదలైంది. దీనికి ప్రత్యేక కారణం ఒకటి ఎన్.టి.ఆర్, రెండు దర్శకుడు బి గోపాల్, మూడు హీరోయిన్ అమీషా పటేల్.. నాలుగు సమరసింహా రెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్ అందించిన నిర్మాత చెంగల వెంకట్రావు. అయితే, కథలో దమ్ము లేకపోవడం వల్ల నరసింహుడు డిజాస్టర్‌గా నిలిచింది. దీనికి ముఖ్య కారణం బడ్జెట్ కంట్రోల్ తప్ప‌డమే.

కానీ, హీరోయిన్ అమీషా పటేల్ కి ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం వల్ల బడ్జెట్ ఇలా పెరిగిందని తన మీద తోసేశారు. ఇక అమీషాకి తెలుగులో మరో చేదు అనుభవం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన నాని. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ వల్ల విపరీతమైన అంచనాలు పెరిగాయి. కానీ, అసలు కథే లేకపోవడం దానికి తోడు మహేష్ పాత్ర కొత్త హీరో లాంచింగ్ సినిమాకు ఉండాల్సింది కావడం లాంటి మేజర్ మైన‌స్‌లు దెబ్బకొట్టాయి.

ఇదే కథ కొత్త హీరోతో అయితే బావుండేది. కానీ, మహేష్ కి ఏమాత్రం వర్కౌట్ కాలేదు. కానీ, సినిమా ఫ్లాపయ్యేసరికి అమీషా పటేల్ వల్లే నాని సినిమా ఫ్లాప్ అని ఆమె మీద తోసేశారు. ఆ తర్వాత మళ్ళీ అడ్రస్ లేకుండా పోయింది. అలా రెండు సినిమాల ప‌రాజ‌యంలోనూ ఆమె మీద‌కే నెట్టేయ‌డం అమీషా బ్యాడ్‌ల‌క్ అంతే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news