Moviesర‌కుల్‌ప్రీత్‌పై టాలీవుడ్‌లో ఆ బ్యాడ్ ముద్ర ఎందుకు వేశారు... అందుకే కెరీర్...

ర‌కుల్‌ప్రీత్‌పై టాలీవుడ్‌లో ఆ బ్యాడ్ ముద్ర ఎందుకు వేశారు… అందుకే కెరీర్ రివ‌ర్స్ అయ్యిందా…!

సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్‌ని ఐరెన్ లెగ్ అని చాలా తక్కువ సందర్భాలలో చాలా తక్కువమంది హీరోయిన్స్ విషయంలో మాత్రమే వినిపిస్తుంది. అలాంటి టాక్ వినిపించిది అంటే మళ్ళీ రకుల్ ప్రీత్ సింగ్ విషయంలోనే. టాలీవుడ్‌కి రకుల్ కెరటం సినిమాతో పరిచయమైంది. కానీ, హీరోయిన్‌గా బాగా గుర్తింపు తెచ్చుకుంది మాత్రం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో. ఈ సినిమాలో ప్రార్ధన పాత్రలో నటించి బాగా క్రేజ్ తెచ్చుకుంది. దాంతో వరుసబెట్టి సినిమాలు చేసే అవకాశాలు అందుకుంది.

రారండోయ్ వేడుక చూద్దాం, నాన్నకు ప్రేమతో, కరెంట్ తీగ, బ్రూస్‌లీ, ధృవ లాంటి బ్లాక్ బస్టర్స్ రకుల్ ప్రీత్ సింగ్‌ఖాతాలో ఉన్నాయి.తెలుగులో మాత్రమే కాదు అమ్మడు తమిళంలో కూడా ఓ ఊపు ఊపింది. చెప్పాలంటే ఒకదశలో రకుల్ ప్రీత్ సింగ్ మహేశ్ బాబు సినిమాకు కూడా డేట్స్ ఇవ్వలేనంత బిజీగా సినిమాలు చేసింది. అలాంటి రకుల్ అదే మహేశ్ బాబు నటించిన డిజాస్టర్ స్పైడర్ తర్వాత మళ్ళీ ఇప్పటివరకూ హిట్ అనేది తెలుగులో అందుకోలేకపోయింది.

మురగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలిసి చేసిన స్పైడర్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అంటే మంచి క్రేజ్ ఏర్పడింది. కానీ, స్పైడర్ సినిమా ఒక్కశాతం కూడా మెప్పించలేకపోయింది. అటు దర్శకుడు, ఇటు హీరోలతో పాటు రకుల్ కెరీర్‌లో భారీ ఫ్లాప్ మూవీగా నిలిచింది. అయితే, స్పైడర్ ప్రభావం అందరికంటే ఎక్కువగా పడింది మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ మీదే. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత ఎంత ట్రై చేసినా రకుల్ హిట్ అందుకోలేదు.

ఈ సినిమా తర్వాత చేసిన మన్మధుడు 2 ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. ఆ సినిమా రకుల్‌ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇక నితిన్ తో చేసిన చెక్, మెగా హీరో – క్రిష్ దర్శకత్వంలో చేసిన కొండపొలం సినిమాలు రకుల్ ప్రీత్ సింగ్‌కి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దాంతో ఇప్పుడు రకుల్ కి ఛాన్స్ ఇద్దామంటే అబ్బా ఆమెది ఐరెన్ లెగ్ అన్న ముద్ర వేసి ప‌క్క‌న పెట్టేస్తున్నారు.

ఇప్పుడు తన టైం బాగోలేదు. అని పక్కకు పెట్టేస్తున్నారు. కానీ, ఇదే రకుల్ కోసం బాలీవుడ్ మేకర్స్ బాగానే క్యూ కడుతున్నారు. అజయ్ దేవగన్ లాంటి హీరో సహకారంతో అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. త్వరలో కమల్ హాస‌న్‌, శంకర్‌ ఇండియన్ 2 షూటింగ్‌లో జాయిన్ కాబోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news