Moviesఆ డైరెక్టర్‌ని ఛార్మి ఎంత లాగిందంటే... రెండు ప్లాపులొచ్చినా స్టార్ హీరోతో...

ఆ డైరెక్టర్‌ని ఛార్మి ఎంత లాగిందంటే… రెండు ప్లాపులొచ్చినా స్టార్ హీరోతో ఛాన్స్ అందుకేనా…!

నీతోడు కావాలి అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఛార్మి కౌర్. అప్పుడు తన వయసు 17 ఏళ్ళలోపే. కానీ, మంచి ఫిజిక్..ముద్దుగా, బొద్దుగా ఉండటంతో మన టాలీవుడ్ మేకర్స్‌కి బాగా నచ్చింది. ముఖ్యంగా క్రియేటివ్ డైరెక్టర్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ అయిన కృష్ణవంశీ ఛార్మీని బాగా ఎంకరేజ్ చేశారు. చెప్పాలంటే ఛార్మి కెరీర్‌లో ఎక్కువగా ఫ్లాప్సే ఉన్నాయి. కాకపోతే, కాస్త పర్ఫార్మర్ కావడంతో దాదాపు ఓ పదేళ్లపాటు హీరోయిన్‌గా నెట్టుకొచ్చింది.

కృష్ణవంశీ తీసిన సినిమాలు ఎక్కువగా ఛార్మీతోనే అని కూడా చెప్పుకోవచ్చు. శ్రీ ఆంజనేయం, చక్రం, రాఖీ లాంటి సినిమాలున్నాయి. నితిన్, అర్జున్ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ శ్రీ ఆంజనేయం సినిమా చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఛార్మీ నటించింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీనికి కారణాలు కథ, కథనం సరిగ్గా లేకపోవడం. ఇది కృష్ణవంశీ మార్క్ మూవీ కాదని అన్నారు. వీటితో పాటు ఛార్మీని కూడా ఓవర్ ఎక్స్‌ఫోజింగ్ చేసి సినిమాను నాశనం చేసిందని కామెంట్స్ చేశారు.

ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఛార్మీ వల్లే శ్రీ ఆంజనేయం ఫ్లాప్ అన్నవాళ్ళు ఎక్కువశాతమే. అయినా కృష్ణవంశీకి ఛార్మీ బాగా నచ్చింది. అందుకే, ప్రభాస్ హీరోగా నటించిన చక్రం సినిమాలో మళ్ళీ ఓ హీరోయిన్‌గా ఛార్మీని తీసుకున్నాడు. మధ్యలో ఒకటి అరా హిట్స్ వచ్చినా కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన రెండవ సినిమా చక్రం కూడా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అప్పుడు కూడా ఇద్దరినీ బాగానే తిట్టుకున్నారు జనాలు.

ఇక జూనియర్ ఎన్.టి.ఆర్ హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన రాఖీ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఇలియానాతో పాటు ఛార్మీ కూడా నటించింది. ఇందులో ఇలియానా కంటే ఛార్మీకే ఎక్కువ పేరొచ్చింది. మొత్తానికి వదలకుండా మూడు సినిమాలు చేసేలా ఛార్మీ ఎలా లాగేసిందో గానీ, కృష్ణవంశీతో హిట్ అందుకొని గానీ, బయటపడలేదు ఛార్మీ. ఇక హీరోయిన్‌గా హిట్స్, ఫ్లాప్స్ చూసిన ఆమె ఇప్పుడు నిర్మాతగానూ హిట్స్, ఫ్లాప్స్ చూస్తుంది. పూరితో కలిసి సినిమాలను నిర్మిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news