Moviesఎన్టీఆర్‌తో ' అల్ల‌రి రాముడు ' సినిమా వెన‌క ఇంత క‌థ...

ఎన్టీఆర్‌తో ‘ అల్ల‌రి రాముడు ‘ సినిమా వెన‌క ఇంత క‌థ న‌డిచిందా… ప్లాప్ అంటూ…!

ఎన్.టి.ఆర్ హీరోగా అల్లరి రాముడు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2002, జూలై 18న విడుదలైంది. ఇందులో ఎన్.టి.ఆర్ సరసన ఆర్తి అగర్వాల్, గజాలా హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటి నగ్మా ఎన్.టి.ఆర్ కి అత్త పాత్రలో నటించారు. అగ్ర రచయితలు పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి మాటలు అందించారు. ప్రముఖ సీనియర్ దర్శకుడు బి గోపాల్ దర్శకత్వం వహించారు. ఆర్‌పి పట్నాయక్ సంగీతం అందించారు. ఈ సినిమా మొదలైనప్పటినుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం దర్శకుడు బి గోపాల్, పరుచూరి బ్రదర్స్. నందమూరి హీరోలకు వీరు ఇచ్చే ప్రాధాన్యత..వారి కోసం పడే శ్రమ అలాంటిది.

ముఖ్యంగా పరుచూర్ బ్రదర్స్‌కి నందమూరి ఫ్యామిలీతో పేత్యేక అనుబంధం, విడదీయరాని బంధం ఉన్నాయి. వీరికి పరుచూరి సోదరులు అని పేరు పెట్టింది నందమూరి తారకరామారావు గారు. ఆయన పెట్టిన పేరే వారికి శాశ్వతంగా నిలిచిపోయింది. అంతటి గొప్ప మహానుభావుడు పెట్టిన పేరును వారు నిలబెట్టుకున్నారు. దాదాపు 250 పై చిలుకు సినిమాలకు కథ మాటలు సమకూర్చారు. వీటిలో సగం సినిమాలు నందమూరి హీరోలకే రాశారనడంలో అతిశయోక్తి లేదు. ఆ ఎన్.టి.ఆర్ నుంచి బాలయ్య, హరికృష్ణ, తర్వాత ఈ ఎన్.టి.ఆర్‌లకు సంభాషణలు రాయడం అంటే ఆ అదృష్టం బహుషా పరుచూరి సోదరులకే దక్కి ఉంటుంది.

అందుకే, అల్లరి రాముడి సినిమాకు మాటలు రాయాల్సి అన్నప్పుడు రెట్టింపు ఉత్సాహంతో రంగంలోకి దిగారు. ఎన్.టి.ఆర్, ఆర్తి అగర్వాల్ మధ్య లవ్ సీన్స్ అయినా, అత్త పాత్రలో నటించిన నగ్మా, తారక్‌ల మధ్య సన్నివేశాలైనా అద్భుతంగా వచ్చాయి. అయితే, ఈ సినిమా రిలీజైన మొదటి రోజు కాస్త డివైడ్ టాక్ వచ్చింది. దాంతో నిర్మాత చంటి అడ్డాల కాస్త కంగారు పడ్డారు. కానీ, తారక్, పరుచూరి బ్రదర్స్ ఒక్కరోజు సైలెంట్‌గా ఉండండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని చెప్పారు.

మొదటి రోజు ఆఖరి ఆట పూర్తయ్యేసరికి మొత్తం సీన్ మారిపోయింది. రిలీజైన అన్నీ ప్రాంతాల నుంచి బ్లాక్ బటర్ హిట్ అనే టాక్. దాంతో రెండవరోజునుంచే భారీగా థియేటర్స్ పెరిగాయి. ఇక ఈ సినిమాకు మ‌రో టెన్ష‌న్ ఉంది. ఈ సినిమా ద‌ర్శ‌కుడు బి. గోపాల్ డైరెక్ట్ చేసిన చిరంజీవి ఇంద్ర సినిమా కూడా జూలై 24న రిలీజ్ అయ్యింది. ఆరు రోజుల తేడాలో ఒకే డైరెక్ట‌ర్ డైరెక్ట్ చేసిన ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు కావ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హీటెక్కేసింది.

ఇక అల్ల‌రి రాముడు సినిమా మాస్ జ‌నాల‌కు, ఎన్టీఆర్‌, నంద‌మూరి ఫ్యాన్స్‌కు బాగా ఎక్కేసింది. మ‌హిళ‌ల‌ను కూడా మెప్పించింది. తారక్ పర్ఫార్మెన్స్ ఆర్తి అగర్వాల్ అందాలు, నగ్మా పొగరబోతు పాత్ర..సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అందించిన పాటలు..ఇలా ప్రతీది అల్లరి రాముడు హిట్ కి కారణమయ్యాయి. అంతేకాదు, రెండవరోజు నుంచి నిర్మాత ఆఫీసుకి పెద్ద పెద్ద సూట్‌కేసులు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాతో నిర్మాత చంటి అడ్డాల ఊహించని లాభాలను చూశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news