Moviesబాల‌య్య 107 కోసం న‌ర‌సింహానాయుడు సెంటిమెంట్‌... !

బాల‌య్య 107 కోసం న‌ర‌సింహానాయుడు సెంటిమెంట్‌… !

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్‌గా వ‌స్తోన్న బాల‌య్య 107 షూటింగ్ శ‌ర‌వేగంగా న‌డుస్తోంది. కంటిన్యూగా న‌డుస్తోన్న ఈ సినిమా షూటింగ్‌కు బాల‌య్య‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో కాస్త బ్రేకులు ప‌డ్డాయి. ఈ సినిమాకు చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. బాల‌య్య‌కు వెండితెర హిట్ అఖండ‌, ఇటు బుల్లితెర హిట్ అన్‌స్టాప‌బుల్ షో సూప‌ర్ డూప‌ర్ హిట్లు. ఇటు క్రాక్ త‌ర్వాత మ‌లినేని గోపీ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇదే. మైత్రీ మూవీస్ లాంటి ప్రెస్టేజియ‌స్ బ్యాన‌ర్లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై మాసీవ్ అంచ‌నాలు పెంచేశాయి. ఇక ఈ సినిమా కోసం మ‌రో అదిరిపోయే టాక్ వినిపిస్తోంది. బాల‌య్య కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయిన న‌ర‌సింహానాయుడు సినిమా సెంటిమెంట్‌ను ఈ సినిమా కోసం వాడుతున్నారు. ఈ సినిమాలో ఫ్యాక్ష‌న్ సీన్ల‌ను షూట్ చేసేందుకు క‌ర్నూలులో న‌ర‌సింహానాయుడు సినిమాలో ఇంట‌ర్వెల్ బ్యాగ్‌కు ముందు వ‌చ్చే చేజింగ్ సీన్ల కోసం వాడిన లొకేష‌న్ల‌నే వాడుతున్నార‌ట‌.

నాడు న‌రసింహానాయుడు సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డం వెన‌క ఆ చేజింగ్ సీన్ ఎంతో హైలెట్ అయ్యింది. అస‌లు నాడు ద‌ర్శ‌కుడు గోపాల్ ఆ లొకేష‌న్ల‌ను ఎంచుకోవ‌డ‌మే సూప‌ర్‌. ఇప్పుడు మ‌రోసారి అదే లొకేష‌న్ల‌లో గోపీచంద్ ఈ సినిమా తీయ‌డం అంటే ఇంట్ర‌స్టింగ్‌గానే ఉంది. అయితే ఈ లొకేష‌న్ల‌లో యాక్ష‌న్ సీక్వెన్సే ఉంటాయ‌ని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో కోలీవుడ్ క్రేజీ భామ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. బాల‌య్య డ్యూయెల్ రోల్ చేస్తుండ‌గా.. క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.
థమన్ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమాను ఈ యేడాది ద‌స‌రా లేదా డిసెంబర్లో రిలీజ్ చేసే ప్లానింగ్ న‌డుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయిన వెంట‌నే అనిల్ రావిపూడి సినిమా షూటింగ్‌లోకి బాల‌య్య ఎంట‌ర్ అవుతాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news