Moviesఎన్టీఆర్ రాజకీయ స‌ల‌హాదారుగా ఆ స్టార్‌ హీరోయిన్‌... సిఫార్సు ఎవ‌రిదంటే...!

ఎన్టీఆర్ రాజకీయ స‌ల‌హాదారుగా ఆ స్టార్‌ హీరోయిన్‌… సిఫార్సు ఎవ‌రిదంటే…!

అన్న‌గారు ఎన్టీఆర్ సినీ వినీలాకాశంలో త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు.. పున్న‌మి చం ద్రుడుగా ఒక వెలుగు వెలిగిపోయారు. సీనీ రంగంలో ఆయ‌న తిరుగులేని ముద్ర వేసుకున్నారు. అయితే.. అన్న‌గారు.. సినీ రంగం నుంచి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం పేరుతో ఆయ‌న పార్టీని స్థాపించారు. అయితే.. ఈ ఆలోచ‌న ఎలా వ‌చ్చింది ? ఎప్పుడు వ‌చ్చింది ? అంటే.. దీనిపై అనేక విష‌యాలు చెబుతారు. దీనిలో మ‌రో కోణం కూడా ఉంద‌నేది సినీ ప్ర‌ముఖుల మాట‌.

 

సాధార‌ణంగా.. ఢిల్లీలోని అప్ప‌టి ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం ఏపీ కాంగ్రెస్ నేత‌ల‌ను త‌క్కువ చేసి మాట్లాడ డం, త‌ర‌చుగా ముఖ్య‌మంత్రుల‌ను మారుస్తుండ‌డం.. ఇందిర‌మ్మ రెండో కుమారుడు హైద‌రాబాద్‌కు వ‌స్తే.. ఆయ‌న‌కు స‌రైన ఆతిథ్యం ల‌భించ‌లేద‌నే కార‌ణంగా.. అప్ప‌టి సీఎంను వెంట‌నే మార్చార‌ని.. ఒక వాద‌న రాజ‌కీయాల్లో ఉంది. ఈ కార‌ణంగానే తెలుగు వారంటే ఇంత చిన్న చూపు చూస్తారా ? అనే ఆగ్ర‌హం తోనే అన్న‌గారు పార్టీ స్థాపించార‌ని అంటారు.

అయితే.. అదే స‌మ‌యంలో ఈ ఒక్క విష‌య‌మే కాదు.. అన్న‌గారిపై మ‌రో ప్ర‌భావం కూడా ఉంద‌ని చెబుతా రు. అదే.. త‌మిళనాడులో ఎంజీఆర్ స్థాపించిన డీఎంకే పార్టీ అని చెబుతారు. తొలుత ఆయ‌న డీఎంకేను స్థాపించారు. నాటి కేంద్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌ను ఢీ కొట్టేందుకు బ‌ల‌మైన ప్రాంతీయ ప్ర‌భుత్వం ఉండాల‌న్న‌దే ఎంజీఆర్ ఆకాంక్ష‌. అందుకే ఆయ‌న త‌మిళుల కోసం త‌మిళుల పార్టీ అంటూ డీఎంకేను స్థాపించారు.

ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ న‌టి.. జ‌య‌ల‌లిత ఈ పార్టీలో కీల‌క రోల్ పోషించారు. ఎంజీఆర్ మ‌ర‌ణం త‌ర్వాత‌.. కరుణానిధి పార్టీని కైవ‌సం చేసుకోవ‌డంతో.. జ‌య ఆయ‌న‌తో విభేదించి..అన్నాడీఎంకే పార్టీని పెట్టుకున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అన్న‌గారిపై జ‌య‌ల‌లిత ప్ర‌భావం కూడా ఉంద‌ని అంటారు.
ఏపీలో అన్న‌గారు పార్టీ పెట్టాల‌ని అనుకున్న‌ప్పుడు.. ఫ‌స్ట్ సంప్ర‌దించింది.. ఎంజీఆర్‌నే. ఆయ‌న సూచ‌న‌లు.. స‌ల‌హాలు కూడా తీసుకున్నారు.

ఈ క్ర‌మంలో అన్న‌గారికి స‌ల‌హాదారుగా.. జ‌య‌ల‌లిత‌ను ఎంజీఆరే.. స్వ‌యంగా పంపించార‌నే టాక్ ఒక‌టి ఉంది. చాలా రోజుల పాటు.. చెన్నైలో జ‌రిగిన రాజ‌కీయ చ‌ర్చ‌ల్లో అన్న‌గారికి జ‌య‌ల‌లిత కొన్ని విష‌యాల్లో రాజ‌కీయ స‌ల‌హాదారుగా ఉన్నార‌ని.. తెలుగు నేప‌థ్యం ఉన్న వ్య‌క్తి కావ‌డంతో జ‌య‌ల‌లిత అనేక సూచ‌న‌లు చేశార‌ని ఒక టాక్ ఉంది. ఇక జ‌య – ఎన్టీఆర్ క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించ‌డంతో వీరిద్ద‌రి అనుబంధం కూడా అలాగే ఉండేది. ఆ త‌ర్వాత‌.. ఎంజీఆర్ మ‌ర‌ణం.. పార్టీలో లుక‌లుక‌ల‌తో జ‌య‌ల‌లిత వేరు ప‌డ‌డం ఆ త‌ర్వాత ఆమె కేంద్రాన్ని ఢీ కొట్టే విష‌యంలో ఎన్టీఆర్ స‌ల‌హాలే పాటించ‌డం జ‌రిగాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news