సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేష్ లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆ కాంబినేషన్ లో సినిమా వచ్చిందంటే పక్కా హిట్ అనే మాదిరిగా అంచాలు ఉంటాయి. అంతే కాకుండా హిట్ కాంబో అని ముద్ర పడితే ఆ సినిమా కోసం అభిమానులు కూడా క్యూ కడతారు. ఇప్పుడు అంటే హీరోలు యేడాదికి ఒక సినిమా చేస్తున్నారు. అప్పట్లో యేడాదికి రెండు, మూడు సినిమాలు చేసేవారు. అందుకే ఒకే హీరోయిన్‌ను లేదా తమకు కలిసి వచ్చిన హీరోయిన్‌ను పదే పదే రిపీట్ చేసేవారు.
టాలీవుడ్ లో ఒకప్పుడు బాలకృష్ణ విజయశాంతి కాంబోను కూడా క్రేజీ కాంబో అని పిలిచేవారు. వీరిద్దరి కాంబినేష్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరూ చేసిన సినిమాల్లో ఒక్క సినిమా మాత్రమే ఫ్లాప్ అయ్యింది. వీరిద్దరి కాంబోలో మొదటి సారిగా కథానాయకుడు సినిమా వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తరవాత కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలయ్య – విజయశాంతి హీరో, హీరోయిన్లుగా పట్టాభిషేకం సినిమా వచ్చింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
ఇక ఆ తరవాత బాలయ్య – విజయశాంతి కాంబోలో కోడిరామకృష్ణ దర్శకత్వంలో ముద్దుల కృష్ణయ్య సినిమా వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1986లో వీరిద్దరి కాంబినేషన్ లో దేశోద్దారకుడు సినిమా వచ్చింది. ఎస్ఎస్.రవిచంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ అయ్యింది. వీరి కాంబోలో వచ్చిన ఐదో చిత్రం అపూర్వ సోదరులు…. కాగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ వెంటనే మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో భార్గవ రాముడు సినిమా వచ్చింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
బాలయ్య – విజయశాంతి కాంబోలో ఏడో సినిమాగా సాహస సామ్రాట్ వచ్చింది. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో అప్పట్లో వివాదాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తరవాత కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో భానుమతిగారి మొగుడు సినిమా వచ్చింది.ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది. ఈ సినిమా తరవాత మువ్వగోపాలుడు సినిమా వచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అంతే కాకుండా ఆ తరవాత ఇన్స్పెక్టర్ ప్రతాప్ అనే సినిమా వీరిద్దరి కాంబోలో వచ్చింది. ఈ సినిమా కూడా యావరేజ్‌గా నిలిచింది. ఈ చిత్రం తరవాత వచ్చిన భలేదొంగ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక బాలయ్య – విజయశాంతిలకు క్రేజీ హిట్స్ ఇచ్చిన కోడీ రామకృష్ణ వీరిద్దరి తో ముద్దుల మావయ్య సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కోడి రామకృష్ణ ఆ వెంటనే ఈ హిట్ పెయిర్ తో ముద్దుల మేనల్లుడు చిత్రాన్ని తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా కూడా హిట్ అయ్యింది.
ఆ తర్వాత ఈ కాంబోలో 14వ సినమాగా లారీ డ్రైవర్ సినిమా వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బి. గోపాల్ దర్శకుడు. ఇక ఆ తరవాత వీరి కాంబోలో తల్లితండ్రులు సినిమా రాగా ఈ చిత్రం హిట్ గా నిలిచింది. బి గోపాల్ దర్శకత్వంలో ఆ తరవాత రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్. చివరగా బాలయ్య విజయశాంతి కాంబోలో 1993లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిప్పురవ్వ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా బాగున్నా ఓవర్ బడ్జెట్‌తో ఫెయిల్ అయ్యింది. వీరి కాంబినేషన్లో ఇదే ఆఖరు సినిమా. ఆ తర్వాత సినిమా రాలేదు.