దేశముదురు సినిమాలో సన్యాసినిగా నటించిన రమాప్రభ అంటే గుర్తుపట్టని వారుండరు. అయితే ఇప్పటి జనరేషన్ కు రమాప్రభ అంటే సీనియర్ నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే తెలుసు. కానీ1980ల్లో రమాప్రభ హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. దాదాపుగా 1400 సినిమాల్లో నటించిన రమాప్రభ ఏపీలోని చిత్తూరు జిల్లాలో జన్మించారు. హాస్యనటిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న రమాప్రభ అల్లు రామలింగయ్య, రాజబాబు లాంటి నటులకు జోడీగా నటించి కామెడీని పండించారు. ఇదిలా ఉంటే విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న శరత్ బాబు రమాప్రభలు ప్రేమించి వివాహం చేసుకున్నారు.
వయసులో తనకంటే చాలా చిన్నవాడైనప్పటికీ శరత్ బాబును రమాప్రభ ప్రేమ వివాహం చేసుకున్నారు. దానికి కారణం అప్పట్లో వీరిద్దిరికీ ఒకరిపై మరొకరికి కలిగిన ప్రేమ మాత్రమే. నిజానికి మొదట రమాప్రభే శరత్ బాబును ఇష్టపడ్డారట. ఈ విషయాన్ని శరత్ బాబు స్నేహితుడు సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. శరత్ బాబు సినిమాల్లో ప్రయత్నాలు చేసున్న సమయంలో అప్పటికే రమాప్రభ నటిగా బిజీగా ఉండేవారట. దాంతో ఆమె రికమెండేషన్ తో శరత్ బాబుకు సినిమా అవకాశాలను కూడా ఇప్పించేరట.
అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందట. తనకు కెరీర్ లో ఎంతో సాయపడ్డ రమాప్రభ పై శరత్ బాబు కూడా మనసు పారేసుకున్నారట. ఇక కెరీర్ లో సెటిల్ అయిన తరవాత శరత్ బాబు రమాప్రభను వివాహం చేసుకుని సెటిల్ అయ్యారట. చాలా కాలం పాటూ సవ్యంగా సాగిన కాపురంలో కొన్నేళ్లకు మనస్పర్దలు వచ్చాయట. ఆ తరవాత ఇద్దరి మధ్య గొడవలు పెరగటంతో చివరికి విడాకులు తీసుకుని ఎదరిదారి వాళ్లు చూసకున్నారు. అయితే ఇప్పటికీ రమాప్రభ తనను శరత్ బాబు వాడుకుని వదిలేశాడంటూ ఆరోపిస్తుంటారు.
తన ఆస్తులు, డబ్బులు అన్నీ కూడా దోచుకున్నాడని ఆమె ఎప్పటికప్పుడు మండిపడుతూ ఉంటారు.
అంతే కాకుండా శరత్ బాబు పేరు వినగానే మండిపోతుంటారు. ఇక సీనియర్ కమెడియన్, నటుడు రాజేంద్ర ప్రసాద్ రమాప్రభకు అల్లుడు అవుతారు. రమాప్రభకు పిల్లలు లేకపోవడంతో ఆమె తన సోదరి కుమార్తె చాముండేశ్వరిని పెంచుకున్నారు. ఆమెకు రాజేంద్రప్రసాద్‌ను ఇచ్చి పెళ్లి చేయడంతో ఆయన అలా రమాప్రభకు అల్లుడు అయ్యారు.