Moviesనాగ‌చైత‌న్య VS స‌మంత పంతంలో పెద్ద యుద్ధ‌మే త‌ప్పిందే...!

నాగ‌చైత‌న్య VS స‌మంత పంతంలో పెద్ద యుద్ధ‌మే త‌ప్పిందే…!

ఒక్క‌టి మాత్రం నాగ‌చైత‌న్య స‌మంత విడిపోయినా వీరిద్ద‌రి మ‌ధ్య ప‌రోక్షంగా పెద్ద పంతాలు అయితే న‌డుస్తున్నాయి. చైతు లైట్ తీస్కొని త‌న ప‌ని తాను చేసుకుపోతున్నా స‌మంత పెడుతున్న పోస్టులు.. ఆమె కామెంట్లు మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు చైతును, అక్కినేని ఫ్యామిలీనో ఏదోలా ప‌రోక్షంగా టార్గెట్ చేస్తున్న‌ట్టుగానే ఉంటున్నాయి.

విడాకుల త‌ర్వాత కెరీర్ ప‌రంగా మాత్రం ఎవ్వ‌రూ వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. చైతును చూస్తే చివ‌రి నాలుగు సినిమాలు మ‌జిలీ – వెంకీమామ – బంగార్రాజు – ల‌వ్‌స్టోరీ నాలుగు వ‌రుస హిట్లు. చైతుకు కెరీర్‌లో ఇంత పీక్ స్టేజ్ ఎప్పుడూ లేదు. ఈ నెల‌లో థ్యాంక్యు సినిమాతో పాటు ఆగ‌స్టులో బాలీవుడ్ మూవీ లాల్‌చ‌ద్దాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ రెండు కూడా అంచ‌నాలు ఉన్న సినిమాలే.

లాల్‌చ‌ద్దా సినిమాతో నాగ‌చైత‌న్య అమీర్‌తో న‌టించ‌డంతో పాటు బాలీవుడ్‌లోకి ఫ‌స్ట్ టైం ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా తెలుగు డ‌బ్బింగ్ రైట్స్‌ను అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ సొంతం చేసుకుని ఆగ‌స్టు 11న హిందీతో పాటు తెలుగులోనూ అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. ఇక స‌మంత న‌టిస్తోన్న థ్రిల్ల‌ర్ మూవీ య‌శోద‌ను కూడా ముందు ఆగ‌స్టులో రిలీజ్ చేయాల‌నుకుని ఇప్పుడు వాయిదా వేశారు.

నాగ‌చైత‌న్య సినిమా ఆగ‌స్టు 11న వ‌స్తుంటే.. య‌శోద‌ను కావాల‌నే మ‌రుస‌టి రోజు 12న రిలీజ్ చేస్తున్న‌ట్టు ముందు నుంచి పోస్ట‌ర్ల‌తో హ‌డావిడి చేశారు. నిజంగానే ఈ రెండు సినిమాలు అదే డేట్‌కు వ‌చ్చి ఉంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అస‌లే పంతంతో ఉన్న స‌మంత – చైతులో ఎవ‌రు పై చేయి సాధిస్తార‌న్న వార్ ఆస‌క్తిగా ఉండి ఉండేది. ఇప్పుడు స‌మంత సినిమా వాయిదా ప‌డ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఇంట్ర‌స్టింగ్ ఫైట్ మిస్ అయ్యామే అని నెటిజ‌న్లు అంటున్నారు.

ఒక‌వేళ లాల్‌చ‌ద్దాకు పోటీగా య‌శోద కూడావ‌చ్చి ఉంటే అక్కినేని ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండేదే కాదు. సోష‌ల్ మీడియాలో కూడా అక్కినేని ఫ్యాన్స్ య‌శోద‌ను టార్గెట్‌గా చేసుకుని కాస్త వైల్డ్‌గానే బిహేవ్ చేసేవాళ్ల‌నే అంద‌రూ అనుకున్నారు. ఇప్పుడు య‌శోద వాయిదా ప‌డ‌డంతో ఈ మాజీ భార్య భ‌ర్త‌ల పంతంలో చిన్న వార్ త‌ప్పింద‌నే అనుకోవాలి.

Latest news