Moviesఅవుట్ డేటెడ్ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ సినిమా... ఆ పెద్ద త‌ప్పు చేస్తే...

అవుట్ డేటెడ్ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ సినిమా… ఆ పెద్ద త‌ప్పు చేస్తే కెరీర్‌కు దెబ్బే…!

ఎన్టీఆర్ కెరీర్ ప‌రంగా చూస్తే ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉన్నాడు. ఒక‌టా రెండా ఏకంగా ఆరు వ‌రుస హిట్లు. 2015లో వ‌చ్చిన టెంప‌ర్ సినిమా నుంచి ఎన్టీఆర్‌కు అస్స‌లు ప్లాప్ అన్న‌దే లేదు. ఇక తాజాగా వ‌చ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హిట్టే కొట్టాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాలో ఎన్టీఆర్ న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్క‌టే వెయిటింగ్‌లో ఉన్నారు.

ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంట‌నే ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ ఇండియా సినిమా చేసేందుకు ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ స‌లార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే ప్ర‌శాంత్ ఎన్టీఆర్ సినిమా కోసం వ‌ర్క్ స్టార్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ అవుట్ డేటెడ్ డైరెక్ట‌ర్ తన‌ను ఎన్టీఆర్ క‌థ రెడీ చేయ‌మ‌న్నార‌ని చెప్ప‌డం ఇప్పుడు ఫ్యాన్స్‌లో ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది.

టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా పేరున్న సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ చాలా లాంగ్ గ్యాప్‌తో రంగ‌మార్తాండ సినిమా చేస్తున్నారు. ప్ర‌కాష్‌రాజ్‌, ర‌మ్య‌కృష్ణ లాంటి సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో ఈ సారి పెద్ద ప్ర‌యోగ‌మే చేస్తున్న‌ట్టుగా ఉన్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ అంద‌రిని ఆక‌ట్టుకుంది.. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ సినిమాతో పాటు త‌న కెర‌ర్ గురించి కృష్ణ‌వంశీ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంలోనే ఎన్టీఆర్ గురించి కృష్ణ‌వంశీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఎన్టీఆర్ త‌న‌ను ఎప్పుడూ క‌లిసినా ఏదైనా మంచి క‌థ ఉంటే చెప్పండి.. చేద్దాం అంటాడ‌ని చెప్పారు. గ‌తంలో వీరి కాంబినేష‌న్లో వ‌చ్చిన రాఖీ సినిమా సెంటిమెంట్ ప‌రంగా మ‌హిళా ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువ అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్‌కు మంచి పేరు వ‌చ్చింది.

 

కృష్ణ‌వంశీ ఒక‌ప్పుడు మంచి డైరెక్ట‌రే అయినా.. ఆయ‌న సినిమాలు క‌మ‌ర్షియ‌ల్‌గా విజ‌యం సాధించింది త‌క్కువ‌. పైగా ఇప్పుడు ఆయ‌న అస్స‌లు ఫామ్‌లో లేడు. ఆయ‌న సినిమాలు అన్నీ వ‌రుస పెట్టి ప్లాప్ అవుతున్నాయి. ఆయ‌నో ఫేడ‌వుట్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ మాట‌వ‌రుసకు అయినా ఆయ‌న‌తో సినిమా చేద్దాం అన‌డం ఎన్టీఆర్ అభిమానులు త‌ట్టుకోలేక పోతున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫామ్ చూస్తే ఏ మాత్రం రిస్క్ చేయ‌కుండా సినిమాలు చేయ‌డం మంచిది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news