Moviesవారెవ్వా: విజయ్ సినిమాలో ఆషూరెడ్డి..జాక్ పాట్ కొట్టిందిగా..?

వారెవ్వా: విజయ్ సినిమాలో ఆషూరెడ్డి..జాక్ పాట్ కొట్టిందిగా..?

యస్..సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్త నిజమే అని తెలుస్తుంది. డబ్ స్మాష్ వీడియోల ద్వారా పాపులర్ అయిన ఆషూ రెడ్డి కి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ముఖ్యంగా అందాల ఆరబోత చూసి నెటిజన్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఎద అందాలు చూపిస్తూ నెటిజనులను మాయ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ రకరకాల డ్రెస్సులు వేస్తూ మరింత మందిని ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతూ..అమ్మడు చేసే ఫోటో షూట్స్ ,,కవర్స్ సాంగస్ అంటే అభిమానులకి ఎంతగానో ఇష్టం. జూనియర్ సమంతగా బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోన్న ఆషూరెడ్డి ఇప్పుడు ఫుల్ ఫాం లో ఉంది. అయితే, బుల్లి తెర పై షోలు..ఈవెంట్లు..యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ చేసుకుంటూ కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్న ఈ భామ ఇప్పుడు సినిమాలో కనిపించబోతుందట. అది కూడా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలో.

విజయ్ హీరో గా నటిస్తున్న సినిమాలో ఆషూ ఓ రోల్ లో దర్శనమివ్వనుంది అన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి తగ్గట్లే అమ్మడు రీసెంట్ గా విజయ్ తో వీడియో కాల్ మాట్లాడుతున్న స్క్రీన్ షాట్ ను షేర్ చేసుకుంది. అర్జున్ రెడ్డితో ఆషూ రెడ్డి అంటూ ఒక క్యాప్షన్ పెట్టింది. ఇప్పుడు ఆషూ రెడ్డి అర్జున్ రెడ్డి తో కలిసి వీడియో కాల్ మాట్లాడుతున్న ఫోటో వైరల్ గా మారింది. ఆ స్క్రీన్ షాట్లను కూడా ఆషూ రెడ్డి తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. మొత్తానికి అయితే అర్జున్ రెడ్డి తో ఆషూ రెడ్డి దిగిన ఈ ఫోటో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆమె విజయ్ సినిమాలో అంటిస్తుందని..అందుకే వీడియో కాల్ లో మాట్లాడుతుందనే న్యూస్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news