టాలీవుడ్‌లో ఒక హీరో చేయాల్సిన సినిమా కొన్ని కారణాలతో మరో హీరో చేయటం మామూలే. ఇలా ఒక హీరో వదులుకున్న సినిమాను మరో హీరో చేసిన్నప్పుడు ఆ సినిమా హిట్ లేదా ప్లాప్ అవుతుంటుంది. ఒక హీరో వదులుకున్న సినిమాతో మరో హీరో హిట్ కొడితే ఆ కథను వదులుకున్న హీరో అభిమానులు కాస్త ఫీలవుతూ ఉంటారు. యాంగ్రీ యంగ్‌మేన్ డాక్టర్ రాజశేఖర్ కెరియర్‌లో ఇబ్బంది పడుతున్న సమయంలో వచ్చిన సింహరాశి రాజశేఖర్‌ను ఇండస్ట్రీలో నిలబెట్టింది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్,బి చౌదరి నిర్మించిన ఈ సినిమాకు వి. సముద్ర దర్శకత్వం వహించారు. ముందుగా ఈ సినిమా కథను సముద్ర నటసింహం నందమూరి బాలకృష్ణతో చేయాలని అనుకున్నారట.
బాలయ్య సముద్రతో సినిమా చేసేందుకు అంతకు ముందు నుంచే ట్రావెల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సింహరాశి కథను కూడా బాలయ్యకు చెప్నారు. అయితే అప్పటికే బాలయ్య సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి రాయలసీమ పవర్పుల్ ఫ్యాక్షన్ కథలతో సినిమాలు చేశారు. వివి. వినాయక్ రాసుకున్న చెన్నకేశరెడ్డి సినిమా కథను డైరెక్ట్ చేయమని దర్శకుడు సముద్రను బాలయ్య కోరారట. సింహరాశి మరి సెంటిమెంటల్ సినిమా అని చెప్పారట.
ఈ స్టోరీ ఇలా ఉండగానే.. ఆ తర్వాత వినాయక్ డైరెక్ట్ చెసిన ఆది సినిమా సూపర్ హిట్ అవడంతో ఈక్వేషన్‌లు మరిపోయినట్టు సముద్ర చెప్పారు. ఆది హిట్ అయ్యాక నిర్మాత బెల్లంకొండ సురేష్, బాలయ్య ఇద్దరు కూడా చెన్నకేశవరెడ్డి సినిమాను వినాయక్ దర్శకత్వంలోనే చేయాలని ఫిక్స్ అయిపోయారు. అలా సముద్ర – బాలయ్య కాంబినేషన్‌లో రావలసిన సింహరాశి సినిమాలో తర్వాత రాజశేఖర్ వచ్చి చేరారు. 2001 లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు రాజశేఖర్ కెరియర్‌కు మంచి ఉపు ఇచ్చింది.
సాక్షి శివానంద్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అ తర్వాత బాలయ్యతో మరో సినిమా చేసేందుకు సముద్ర ఎన్ని ప్రయత్నాలు చేసిన సాధ్యం కాలేదని అయనే చెప్పారు. తర్వాత సముద్ర సుపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నారు. ఒక్కడు హిట్ అయ్యక మహేష్ కెరియర్‌లో మార్పులు రావడంతో ఈ సినిమా కూడా పట్టాలెక్కలేదు.