హీరో వేణు టాలీవుడ్‌లో రెండు దశాబ్దాల క్రిందట మంచి ఫాలోయింగ్‌తో ఓ వెలుగు వెలిగాడు. స్వయంవరం, చిరునవ్వుతో, పెళ్లాం ఊరెళితే, కళ్యాణ రాముడు లాంటి సినిమాలతో సక్సెస్ అయ్యాడు. వేణు స్టైల్‌కు, యాక్టింగ్, కామెడీలో అతడి మేనరిజమ్‌కు ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. స్వయంవరం, చిరునవ్వుతో సినిమాలతో వేణుకు మంచి పాపులారిటీ వచ్చింది. తర్వాత కుర్ర హీరోల పోటీ తట్టుకోలేక, ప్లాపులతో ఫేడవుట్ అయిపోయాడు.
వేణు మంచి కథలు ఎంపిక చేసుకుని.. తనకు తనను మార్చుకుని ఉంటే ఇప్పటకీ ఇండస్ట్రీలో కొనసాగేవాడే. ఆ తర్వాత వేణును అందరూ మర్చిపోయారు అనుకుంటోన్న టైంలో ఎన్టీఆర్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన దమ్ము సినిమాలో నటించాడు. ఆ పాత్ర బాగున్నా.. ఆ సినిమా సక్సెస్ కాలేదు. ఆ మళ్లీ ఇప్పుడు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ సినిమా రామారావు ఆన్‌డ్యూటీలో కనిపించబోతున్నాడు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లతో మళ్లీ యాక్టివ్ అయ్యి.. ఆ పాత విషయాలు గుర్తు చేసుకుంటున్నాడు. ఇక వేణుకు సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. వేణు ఎవరో కాదు సీనియర్ దర్శకుడు బి. గోపాల్‌కు స్వయానా మేనల్లుడు. వేణుది ప్రకాశం జిల్లా. తెలుగు సినిమా చరిత్రను సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, ఇంద్ర లాంటి సినిమాలతో మార్చిన ఘనత గోపాల్‌ది. ఆయన ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే తన మేనల్లుడు కోసం ఓ సినిమా అనుకున్నారు. అయితే బడ్జెట్, కథ సెట్ కాక ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు.
తర్వాత గోపాల్ సినిమాలు చేయడం కొద్ది రోజులు కంటిన్యూ చేసి మానేశారు. వేణు క్రమక్రమంగా తెరమరుగు అయ్యాడు. గోపాల్ – వేణు కాంబినేషన్లో ఓ సినిమా వచ్చి ఉంటే వేణు మరికొంత కాలం ఫామ్‌లో ఉండేవాడనే అంటారు. ఇక పారిశ్రామిక వేత్త, మధుకాన్ గ్రూప్స్ అధినేత, ప్రస్తుతం ఖమ్మం ఎంపీగా ఉన్న టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావుకు వేణు స్వయానా బావమరిది.
ఇలా రాజకీయపరమైన బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు అటు సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా వేణు అనుకున్న రేంజ్‌లో స్టార్ హీరో కాలేదు. ఇక ప్రస్తుతం వ్యాపారాల్లో బిజీగా ఉన్న వేణు రామారావు ఆన్‌డ్యూటీతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, దేశముదురు సినిమాలు కూడా వేణు చేయాల్సిన సినిమాలే అట.