సినీ వినీలాకాశంలో తనకంటూ.. ప్రత్యేక పంథాను అనుసరించిన అన్నగారు ఎన్టీఆర్ అనేక ప్రత్యేకతలు సృష్టించారు. సినీ రంగం లో అనేక అద్భుతాలు తీసుకువచ్చారు. అనేక మందికి మార్గదర్శిగా మారారు. అయితే.. అదే సమయంలో ఎన్ని రికార్డులు సృష్టించినా.. ఎన్ని రివార్డులు సాధించినా.. అన్నగారి చుట్టూ కొన్ని వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. సినిమాల పరంగా పోటీ కావచ్చు.. పాత్రల పరంగా తన తోటి హీరోలతో ఉన్న వృత్తిపరమైన పోటీ నేపథ్యంలో కూడా ఎన్టీఆర్ కొన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఇవన్నీ కేవలం వృత్తిపరమైన పోటీ వల్ల వచ్చిన విబేధాలు మాత్రమే.
ఎన్టీఆర్‌కు సినీ రంగంపై ఉన్న ప్రేమ కావొచ్చు.. అభిమానం కావొచ్చు.. తనకంటూ.. ప్రత్యేక ముద్ర ఉండాలనే కోరిక కావొచ్చు. ఏదైనా సరే కొన్ని కొన్ని సార్లు కొందరితో విభేదించారు. ఇలాంటి విభేదాలు అన్నగారి సినీ జీవితంలో కొన్ని మార్పులు వచ్చేలా చేశాయి. ఇలాంటి వాటిలో ప్రధానంగా తాతినేని కుటుంబంతో అన్నగారు తీవ్రస్థాయిలో విభేదించారు. దీంతో ఆయన కొన్ని సినిమాలను కూడా వదులుకున్న పరిస్థితిని ఎదుర్కొన్నా రు.
ఓ సినిమాలో డైలాగుల విషయంలో అన్నగారు సముద్రాల సీనియర్‌తో విభేదించారు. నిజానికి అప్పటి వరకు.. సము ద్రాల రచన, దర్శకత్వంలో అన్నగారు పనిచేశారు. అనేక ఉత్తమ సాంఘిక చిత్రాల్లో నటించారు.. మంచి కమర్షియల్ మూవీలను కూడా నిర్మించారు. అయితే.. అనూహ్యంగా `పిచ్చిపుల్లయ్య` సినిమాకు రాసిన డైలాగుల విషయంలో తాతినేని ప్రకాశ రావుతో అన్నగారు విభేదించారు. డైలాగుల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు.
దీంతో తాతినేనికి ఆగ్రహం రావడంతో తర్వాత సినిమాల విషయంలో అన్నగారిని సంప్రదించలేదనే టాక్ సినీ వర్గాల్లో ఉంది. ఆ తర్వాత.. అన్నగారి స్థానంలో శోభన్‌బాబును ఎంచుకు న్నారని అంటారు. అయితే.. తర్వాత చాలా కాలానికి మళ్లీ సినిమా ప్రపోజల్ వచ్చినా.. అన్నగారు.. ఒప్పుకోలేదని.. సినీ వర్గాల్లో టాక్ ఉంది. ఏదేమైనా.. ఇలాంటి చిన్న చిన్న విభేదాలు అయితే అన్నగారి సినీ జీవితంలో అప్పుడప్పుడు అరుదుగా చోటు చేసుకున్నాయి.