Moviesటాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్‌కు ప్లాపుల హీరోయిన్ బినామీయా... కోట్ల ఆస్తులు ఆమె...

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్‌కు ప్లాపుల హీరోయిన్ బినామీయా… కోట్ల ఆస్తులు ఆమె పేరు మీదే…!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్‌కు ప్లాపుల హీరోయిన్ బినామీయా… కోట్ల ఆస్తులు ఆమె పేరు మీదే…!
ఆయ‌నో స్టార్ ప్రొడ్యుస‌ర్. టాలీవుడ్‌లో ఆయ‌న ప‌ట్టింద‌ల్లా బంగార‌మే. ఆయ‌న సినిమాలు తీసినా.. సినిమాలు కొన్నా.. డిస్ట్రిబ్యూష‌న్ చేసినా.. ఆయ‌న క‌థా జ‌డ్జ్‌మెంట్ ఇలా అన్నింట్లోనూ ఆయ‌న‌కు తిరుగు అయితే లేదు. స్టార్ హీరోలు – ద‌ర్శ‌కుల కాంబినేష‌న్లు సెట్ చేయాల‌న్నా ఆయ‌న వ‌ల్లే అవుతుంది. ఆయ‌న అడిగితే ఎంత పెద్ద హీరో అయినా కాద‌న‌కుండా డేట్లు ఇచ్చేస్తారు. అలాగే ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఆయ‌న డిస్ట్రిబ్యూష‌న్ చేస్తేనే స‌క్సెస్ బాగుంటుంద‌ని ఫీల‌వుతారు.

ఆయ‌న కోట్లాది ఆస్తులు కూడ‌బెట్టారు. ఆయ‌న త‌న సంపాద‌న‌ను హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్‌లో మాత్ర‌మే కాదు.. పూణే రియ‌ల్ ఎస్టేట్లో కూడా భారీగానే పెట్టారు. మ‌రి ఆయ‌న‌కు ఆస్తులు మ‌రీ అంత ఎక్కువ అయిపోయాయో ఏమోగాని.. లేదా త‌న ఆస్తుల‌ను ఎవ‌రి పేరు మీద అయినా పెట్టేందుకు స‌రైన న‌మ్మ‌క‌స్తులు లేరేమో తెలియ‌దు కాని.. ఇప్పుడు ఓ ఫేడ‌వుట్ అందాల భామ మీద ఆయ‌న ఆస్తులు రాస్తున్నార‌ట‌.

అంటే ఆ ఫేడ‌వుట్ అందాల భామే ఆయ‌న గారి ఆస్తుల‌కు బినామీ అన్న టాక్ అయితే విన‌ప‌డుతోంది. త‌క్కువ టైంలో ఆమెకు అంత ఆస్తులు ఎక్క‌డ నుంచి వ‌చ్చాయో అర్థం కాక‌.. ఆ మ‌ధ్య ఐడీ కూడా ఆమెను టార్గెట్ చేసి ఆమె ఇళ్ల‌ల్లో సోదాలు కూడా చేసింద‌ట‌. స‌ద‌రు హీరోయిన్ మీడియం రేంజ్ హీరోయిన్‌గా ఎదిగిందే త‌ప్పా పెద్ద హీరోల సినిమాల్లో ఒక‌టి, ఆరా ఛాన్సులు మాత్ర‌మే వ‌చ్చాయి.

ఆమె ఏజ్ రేంజ్ హీరోయిన్లు అంద‌రూ ఇప్ప‌టికే చాప చుట్టేసినా ఆమె మాత్రం ఇంకా తాను ఫీల్డ్‌లో ఉన్నాను అనిపించుకునేందుకు సినిమాలు చేస్తోంది. ఇటీవ‌ల ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన సినిమా కూడా చాప చుట్టేసింది. వ‌రుస‌గా మూడు ప్లాపులు కూడా ప‌డ్డాయి ఆమెకు. ఆమెకు ఈ ఛాన్సులు రావ‌డం వెన‌క కూడా స‌ద‌రు స్టార్ ప్రొడ్యుస‌ర్ గారు ఉన్నారంటున్నారు.

ఇక ఆ అందాల భామ‌ ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరోతో ప్రేమ‌లో ఉన్న‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటున్నార‌ని.. సీక్రెట్‌గా ప్రేమ‌లో కూడా ఉన్నార‌ని ఒక్క‌టే ప్ర‌చారం న‌డుస్తోంది. ఏదేమైనా ఈ భామ‌పై ఇప్పుడు ఆ స్టార్ ప్రొడ్యుస‌ర్ స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఒక్క‌టే గుస‌గుస‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news