Moviesబాలయ్య బాబు ఫ్యానిజం ఎలా ఉంటుందంటే.. అదో ఎన‌ర్జీ.. అదో స్పెష‌ల్...

బాలయ్య బాబు ఫ్యానిజం ఎలా ఉంటుందంటే.. అదో ఎన‌ర్జీ.. అదో స్పెష‌ల్ అంతే..!

సీజన్, అన్ సీజన్..సెంటిమెంట్స్ అనేవి కొన్ని విషయాలలో బాలయ్య బాబు బాగా ఫాలో అవుతుంటారు. ఇక ఆయనతో సినిమా తీసే నిర్మాతల సెంటిమెంట్‌ని బాలయ్య బాగానే ఫాలో అవుతుంటారు. దీనికి ఉదాహరణ లక్ష్మీ నరసింహా సినిమా సమయంలో టైటిల్ ఏం పెట్టాలా అని దర్శకుడు
జయంత్ సి పరాంజీ, నిర్మాత బెల్లంకొండ సురేష్ బాగా ఆలోచించారు. ఆ సమయంలో వాళ్ళు అనుకున్న టైటిల్ లక్ష్మీ నరసింహా. ఇదే విషయం వాళ్ళు బాలయ్యకి చెబితే..చాలా బావుంది.. నీకు కావాల్సిన లక్ష్మీ ఉంది.. నాకు కావాల్సిన నరసింహ స్వామీ ఉన్నారు..ఇనేంటి అదే పెట్టేద్దాం..అని గ్రీన్ సిగ్నల్
ఇచ్చారు.

అలా, ఏ విషయంలో కూడా మేకర్స్‌తో బాలయ్య వాదనలు చేసిన సందర్భం లేదనే చెప్పాలి. ఈ ఒక్క సినిమా విషయంలో మాత్రమే కాదు..దాదాపు బాలయ్య చేసిన ప్రతి సినిమా విషయంలోనూ అంతే. ఏదైనా ఒక్కసారే..ఒకేసారి నిర్ణయం తీసేసుకుంటారు. ఒకసారి డిసైడైయ్యాకా అది రాంగా రైటా అని
ఆలోచించరు.. చేసుకుంటూ పోవడమే. అందుకే, రచయితలు, దర్శకులు ఆయన స్వభావానికి దగ్గరగానే పాత్రలను, డైలాగులను రాస్తుంటారు. ఇక అన్నిటికంటే కూడా బాలయ్య సినిమా సంక్రాంతికి వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో
అయితే బాలయ్యకున్న అభిమానులు చేసే రచ్చ రంబోలా మామూలుగా ఉండ‌దు.

సంక్రాంతికి కోడి పందేలు, ఎడ్ల పందేలు ఎలాగైతే కడతారో..బాలయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా ఇంత కలెక్ట్ చేస్తుందనీ అభిమానులే ఊహించని విధంగా బెట్టింగులు కాస్తుంటారు. బాలయ్య సినిమా రు. 80 కోట్లు రాబడుతుందని ఒక అభిమాని పందెం కాస్తే మరో అభిమాని రు. 100 కోట్లు
వసూలు చేస్తుందని పై చేయి చూపిస్తాడు. అలా అభిమానులే బాలయ్య సంక్రాంతి సీజన్‌లో దిగే కొత్త సినిమాపై బెట్టింగ్ కాస్తుంటారు. అంత పిచ్చి అభిమానం నందమూరి హీరోలంటే.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇద్దరూ బాలయ్య అభిమానులే. ఎవరు గెలిచినా అది అబాలయ్య ఫ్యానే. అలా ఉంటది మరి బాలయ్య బాబు ఫ్యానిజం. బాల‌య్య అభిమానులు బాల‌య్య సినిమా వ‌చ్చిన‌ప్పుడు చేసే హంగామా ఆ ర‌చ్చ వేరే లెవ‌ల్‌. అయితే ఇత‌ర హీరోల సినిమాలు రిలీజ్ అయిన‌ప్పుడు కూడా థియేట‌ర్ల‌లో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోకే జై బాల‌య్య నినాదాలు మార్మోగిస్తుంటారు. ఈ ట్రెండ్ క్రియేట్ చేసింది ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో బాల‌య్య అభిమానులు మాత్ర‌మే.

బాల‌య్య‌కు హిట్లు వ‌చ్చినా ప్లాపులు వ‌చ్చినా బాల‌య్య పేరు చెపితే ఫ్యాన్స్‌లో మాత్ర‌మే కాదు.. సినీ ల‌వ‌ర్స్‌లో కూడా అదో ఎన‌ర్జీ.. ఫ్యాన్స్‌కు అదో తృప్తి అంతే. బాల‌య్య సినిమా అంటే థియేట‌ర్ల‌లో సౌండ్‌ల మోత మోగాల్సిందే. డైలాగులు పేలిపోవాల్సిందే. అదే బాల‌య్య‌కు ఫ్యాన్స్‌కు బాగా న‌చ్చుతుంది. ఇక బాల‌య్య తాజా సినిమా ఎన్‌బీకే 107 దసరా బరిలో వస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ, ఇంటర్నల్ టాక్ ప్రకారం గత ఏడాది డిసెంబర్ 2కి రిలీజై సంచలన విజయం అందుకున్న అఖండ రిలీజ్ సెంటిమెంట్ ప్రకారం ఈ ఏడాది కూడా డిసెంబర్ 2న కొత్త చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news