Movies50 ఏళ్లు వ‌చ్చినా ల‌వ్ ఫెయిల్యూర్‌తో పెళ్లికి దూర‌మైన హీరోయిన్లు వీళ్లే...!

50 ఏళ్లు వ‌చ్చినా ల‌వ్ ఫెయిల్యూర్‌తో పెళ్లికి దూర‌మైన హీరోయిన్లు వీళ్లే…!

సినిమా హీరోయిన్లు ఇటీవ‌ల కాలంలో ఏజ్ బార్ అవుతున్నా కూడా పెళ్లి చేసుకోవ‌డం లేదు. న‌య‌న‌తార‌, అనుష్క‌, నిక్కీ గల్రానీ, అంజ‌లి, శ్రీయ , త‌మ‌న్నా వీళ్ల‌లో చాలా మంది మూడున్న‌ర ప‌దులు వ‌స్తే గాని మూడు ముళ్లు వేయించుకోలేదు. మ‌రి కొంద‌రు అయితే ఇంకా పెళ్లి అన్న మాటే అన‌డం లేదు. న‌య‌న‌తార‌, అనుష్క‌, త‌మ‌న్నా లాంటి హీరోయిన్లు సీనియ‌ర్ హీరోల‌కు ఆప్ష‌న్‌గా మార‌డంతో పాటు ఈ ఏజ్‌లో మాంచి రెమ్యున‌రేష‌న్ వస్తుండ‌డంతో వాళ్లు ఇంకా పెళ్లి ఎందుకు చేసుకుంటారు.. అంజ‌లి ముదురుపోయింది.. ఇంకా పెళ్లి అన్న‌మాటే అన‌డం లేదు.

శృతీహాస‌న్‌ది అదే ప‌రిస్థితి.. మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు దాటేసింది. ఇంకా పెళ్లి చేసుకోలేదు. చిరు, బాల‌య్య లాంటి హీరోల‌కు ఇప్పుడే ఆమె పెద్ద ఆప్ష‌న్ అయిపోయింది. దీనికి తోడు ఒక్కో సినిమాకు ఎలా లేద‌న్నా రు. 2 కోట్లు ఇస్తున్నారు. ఇంకేముందు పెళ్లి లేదు గిల్లీ లేదు అంటోంది. అటు కోలీవుడ్‌లో మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా అంతే..!

అయితే వీరీ కంటే ముందు త‌రంలో ఉన్న హీరోయిన్ల‌లో కొంద‌రు 50 ఏళ్లు దాటుతున్నా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు. వీరిలో కొంద‌రు కెరీర్ మాయ‌లో ప‌డి పెళ్లికి దూర‌మైతే.. మ‌రి కొంద‌రు ల‌వ్ ఫెయిల్యూర్స్ వ‌ల్ల పెళ్లికి దూరం అయిపోయారు. ప్ర‌స్తుతం త‌ల్లి పాత్ర‌లు చేస్తోన్న సీనియ‌ర్ న‌టిమ‌ణి సితార ఓ కోలీవుడ్ హీరోతో ప్రేమాయ‌ణం ఫెయిల్ అవ్వ‌డం వ‌ల్లే పెళ్లికి దూర‌మైంది. ఇప్ప‌ట‌కీ ఆమె పెళ్లి చేసుకోలేదు.

మ‌రో న‌టి నిర్మల సైతం ఎంజీఆర్‌తో ప్రేమాయ‌ణం వ‌ల్లే పెళ్లికి దూర‌మైపోయిందంటారు. ఇక ముత్యాల ముగ్గు సంగీత కూడా ఎంజీఆర్ వ‌ల్లే పెళ్లి చేసుకోలేద‌ని.. ఆయ‌న్ను పిచ్చిగా ప్రేమించి ఆయ‌న హ్యాండ్ ఇవ్వ‌డంతో ఇప్ప‌ట‌కీ అలాగే ఉండిపోయింద‌ని అంటారు. ఇక మ‌రో సీనియ‌ర్ న‌టి ట‌బు సెకండ్ ఇన్సింగ్స్‌లో ఆంటీ, త‌ల్లి పాత్ర‌ల‌తో అద‌ర గొడుతోంది. ఆమె టాలీవుడ్ మ‌న్మ‌థుడు, సీనియ‌ర్ నాగార్జున‌తో ప్రేమాయ‌ణం వ‌ల్లే పెళ్లి చేసుకోలేద‌న్న ప్ర‌చారం ఉంది.

అలాగే ట‌బుకు బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పేయ్‌కు కూడా రిలేష‌న్ ఉందంటారు. ఇక న‌గ్మా ప్రేమాయ‌ణాలు చాలానే ఉన్నాయి. కోలీవుడ్ న‌టుడు శ‌ర‌త్‌కుమార్‌, భోజ్‌పురి న‌టులు మ‌నోజ్‌బాజ్‌పేయ్‌, రవికిష‌న్ సింగ్‌, క్రికెట‌ర్ సార‌వ్ గంగూలీతో ప్రేమ‌య‌ణాలు న‌డిపి చివ‌ర‌కు పెళ్లికి దూర‌మైంది. ఇక మ‌రో సీనియ‌ర్ న‌టి శోభ‌న అయితే మ‌ళ‌యాళ హీరో ప్రేమ‌లో ప‌డి మోస‌పోవ‌డంతో పెళ్లి చేసుకోలేదంటారు.

ఇక అమీషా ప‌టేల్ కూడా బాలీవుడ్‌లో ప‌లు ప్రేమాయ‌ణాలు న‌డిపి పెళ్లికి దూర‌మైంది. సీనియ‌ర్ న‌టీమ‌ణులు ర‌జిత‌, రాగిణి కూడా పెళ్లి చేసుకోలేదు. మ‌రి ఇప్ప‌ట‌కీ అయినా వీరు పెళ్లి చేసుకుంటారా ? ఇలా జీవితాంతం పెళ్లి, సంసార బంధానికి దూరంగా ఉంటారా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news