సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకరు తరువాత ఒకరు మరణిస్తూ..ఆ విషాద వార్తలతో సినీ ఇండస్ట్రీ శోకశంద్రలో మునిగి పోయింది. కొందరు అనారోగ్య కారణాల చేత మరణిస్తుంటే..మరికొందరు వయసు పై పడ్డి..మరికొందరు చిన్న వయసులోనే గుండే పోటుతో ..తనువు చాలిస్తున్నారు. రీసెంట్ గా పలువురు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నటుల మరణ వార్తలు విని విని..ఆ విషాదంలో మునిగిన జనాలను..మరో విషాద వార్త పలకరించింది. ఓ విషాదం తాలూకు జ్ఞాపకాల నుంచి బయటకు రాకముందే మరో విషాదం చోటుచేసుకోవడం చూస్తున్నాం.
తాజాగా ప్రముఖ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నాత్) మృతి చెందారు. కోల్ కత్లాలో స్టేజ్ పై ప్రదర్శన ఇస్తుండగానే ఆయన కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇలా చిన్న వయసులోనే ఆయన లోకాని విడిచి వెళ్లిపోవడంతో సినీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆయన వయసు 53 సంవత్సరాలు. హర్ట్ అటాక్ కారణంగా ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో సంగీత ప్రపంచం శోకశంద్రంలో మునిగిపోయింది. ఈ వార్త తెలుసుకున్న ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నారు.
కేకే తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠి, బెంగాలీ, అస్సామీ, గుజరాత్ వంటి పలు ఇండియన్ భాషల్లో అనేక పాటలు పాడారు. కేకే తెలుగులో పాడిన అన్ని పాటలు ఆల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గానే నిలిచాయి. ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో ఒకరికి ఒకరై ఉంటుంటే అనే పాటని కేకే నే పాడారు . ఆయన పాడిన తొలి తెలుగు పాట ఇదే కావడం గమనార్హం
ఆ తర్వాత ఇంద్ర దాయి దాయి దామ్మా పాట .. ఆ తర్వాత’ఆర్య చిత్రంలో ఫీల్ మై లవ్ ..పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్‌లో లే లే లే లే ఇవాళే లేలే ..చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో చైల చైల చైలా చైలా పాట..నేనున్నాను సినిమాలో నీ కోసం నీ కోసం పాట.. నా ఆటో గ్రాఫ్‌లో గుర్తుకొస్తున్నాయి అనే పాట పాడింది కూడా ఈయనే. ఇలా చాలా వరకు సింగర్ కేకే ఉత్సహభరితమైన పాటలతో తెలుగు శ్రోతలను అలరించారు. ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పాలి.