Moviesమామ కి బిగ్ షాకిచ్చిన మాజీ కోడలు పిల్ల..త్వరలో అధికారిక ప్రకటన...

మామ కి బిగ్ షాకిచ్చిన మాజీ కోడలు పిల్ల..త్వరలో అధికారిక ప్రకటన ..?

వాట్…బిగ్ బాస్ హోస్ట్ గా హీరోయిన్ సమంత రంగంలోకి దిగనుందా..అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. బిగ్ బాస్ సీజన్ 3 నుండి కంటీన్యూ గా హోస్ట్ చేస్తున్న నాగార్జున ..ఇక పై హోస్టింగ్ చేయనని చెప్పడంతోనే..బిగ్ బాస్ మెనేజ్మేంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే..టెలివిజన్ రంగంలోనే బిగ్ బాస్ షో కి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంత మంది ఈ షో ని తిడుతున్నా..బ్యాన్ చేయాలి అని చెప్పుతున్నా..ఈ షో చూసే వారి సంఖ్య రోజు రోజు కి పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు.

ఈ క్రమంలోనే రీసెంట్ గానే బిగ్ బాస్ OTT కంప్లీట్ చేసుకున్న ..బిగ్ బాస్. సీజన్ 6 పేరిట త్వరలోనే మన ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు బిగ్ బాస్ 6 లోకి వెళ్ళే కొంతమంది కంటెస్టెంట్ల లిస్ట్ కూడా బయటకు వచ్చేసింది. ఇక ఈసారి సెలబ్రిటీల తో పాటు..సామాన్యులను కూడా బిగ్ బాస్ 6 లోకి తీసుకోబొతున్నారట. ఇది ఇలా ఉండగా..తెర పైకి షాకింగ్ న్యూస్ లీకైంది. ఈసారి బిగ్ బాస్ 6 కు హోస్ట్ గా స్టార్ హీరోయిన్ సమంత ఫిక్స్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ హోస్టుగా అక్కినేని నాగార్జున గ్యాప్ తీసుకోవాలి అనుకుంటున్నారని..ఇక ఇదే టైంలో ఆయన స్థానంలో నాగ్ మాజీ కోడలు సమంత రాబోతుందని..సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. ఇక ఈ క్రమంలోనే..సమంత తన ఇన్స్టా అకౌంట్ లో” Coming soon” అంటూ రాసుకొచ్చింది. దీంతో బిగ్ బాస్ 6 కి సమంత హోస్టింగ్ చేయబోతుందని..పరోక్షంగా హింట్ ఇచ్చిన్నట్లైంది. మరి చూడాలి, మామ స్దానంలోకి వస్తున్న మాజీ కోడలు పిల్ల..మామ ను మించిపోయేలా మెప్పిస్తుందో లేదో..? నాగార్జునను మరిపించేలా సమంత బిగ్ బాస్‌ షోను ఎలా హోస్ట్ చేయనున్నారన్న అంశం ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news