Moviesఆ ఒక్క తప్పు..ఈయన జీవితాని తలకిందులు చేసేసింది..!!

ఆ ఒక్క తప్పు..ఈయన జీవితాని తలకిందులు చేసేసింది..!!

గోపీచంద్.. హీరో లాంటి కటౌట్ ఉన్న వ్యక్తి..కెరీర్ మొదట్లో విలన్ గా మెప్పించి..ఆ తరువాత తన ఇష్టం మేరకు మెల్లగా హీరో గా మారి..సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. గోపీచంద్ ఫస్ట్ సినిమా తొలివలపు. ఈ సినిమాలో చాలా యంగ్ గా, హ్యాండ్ సమ్ లుక్ లో రొమాంటిక్ హీరోగా సినీ ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు. ఆ సినిమా పర్లేదు అనిపించింది. అయితే, అప్పుడు ఈయన గురిచి చాలా మందికి తెలియదు. కానీ.. ఆ తర్వాత నటించిన జయం సినిమాతో..గోపీచంద్ అందరికి ఫేవరేట్ విలన్ గా మారిపోయాడు. జయం సినిమాలో ప్రతి నాయకుడిగా మారి అందరికి షాక్ ఇచ్చారు గోపిచంద్.

అస్సలు విలన్ రోల్ ఎందుకు చేశాడో కూడా తెలియదు. గోపీచంద్ లుక్స్ హీరో గా బాగుంటాయి. ఆ హైట్ ఆ వెయిట్..ఆ కోపం..బాగా సెట్ అవుతాయి. కానీ, ఎందుకో విలన్ గా సినిమాలు చూస్ చేసుకున్నాడు. ఇక ఆ తరువాత మహేశ్ బాబు హీరో గా నటించిన నిజం సినిమాలో విలన్ గా చేసాడు, ఆ తరువాత పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరో గా నటించిన వర్షం సినిమాల్లో కూడా విలన్ గా నటించి అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేసాడు గొపీచంద్. ఆ సినిమాల్లో హీరో పాత్రకి సరి సమానంగా..ఆయన పెర్ఫార్మన్స్ కి న్యాయం చేసి సినిమా విమర్శకులు సైతం ఫిదా అయ్యేలా చేశారు.

ఆ తరువాత మళ్ళీ కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే..మంచి మంచి సినిమా ఆఫర్లను వదులుకుని..హీరో సినిమాలు చేయడానికి ట్రై చేశాడు . ఆయన మీద నమ్మకంతో డైరెక్టర్లు కూడా గోపీచంద్ కు చాలా చాలా అవకాశాలు ఇచ్చారు. కానీ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బొల్తా కొడుతూ వచ్చింది. ఇక ఆ తరువాత చాలా కాలానికి..సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సిటీమార్ సినిమాలో హీరో గా నటించి..ఫైనల్ గా హీరో గా హిట్ కొట్టాడు గోపీచంద్.

కాగా, గోఫీచంద్ కెరీర్ మొదట్లోనే తన హీరోలుగా కంటీన్యూ అయ్యున్నా ఈరోజు ఇంత ప్రాబ్లమ్ ఉండేది కాదు. పోనీ హీరో గా కాకుండా విలన్ రోల్ నే చూస్ చేసుకుని ఉన్న..ఇప్పుడు కధ వేరేగా ఉండేది. ఖచ్చితంగా ఆయన టాలెంట్ కి, లుక్స్ కి, డెడికేషన్ కి..ఇప్పుడు స్టార్ సెలబ్రిటీల రేంజ్ లో ఉండేవాడు. ఏం చేద్దాం చిన్న తప్పు గోపీచంద్ జీవితాని తలకిందులు చేసేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news