Moviesవిజ‌య్ - వంశీ సినిమాపై సెటైర్లు.. మ‌హేష్ సినిమాను కాపీ కొట్టేశారుగా...!

విజ‌య్ – వంశీ సినిమాపై సెటైర్లు.. మ‌హేష్ సినిమాను కాపీ కొట్టేశారుగా…!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ తొలిసారి ఓ తెలుగు డైరెక్ట‌ర్‌తో క‌లిసి ప‌నిచేస్తున్నాడు. దిల్ రాజు బ్యాన‌ర్లో అదే దిల్ రాజుకు ద‌గ్గ‌ర బంధువు అయిన వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ 66వ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాతో విజ‌య్ తొలిసారిగా తెలుగులో కూడా సూప‌ర్ హిట్ కొట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌య్‌కు మిగిలిన కోలీవుడ్ హీరోల‌తో పోలిస్తే పెద్ద‌గా తెలుగు మార్కెట్ లేదు.

ఈ సినిమాతో ఎలాగైనా తెలుగులో మంచి మార్కెట్‌కు పునాది వేసుకోవాల‌ని విజ‌య్ స్ట్రాంగ్ డెసిష‌న్ తీసుకున్నాడు. అందుకే దిల్ రాజు బ్యాన‌ర్లో ఇటు తెలుగు డైరెక్ట‌ర్ వంశీతో సినిమా చేసేందుకు ఓకే చెప్పేశాడు. పైగా ఇటీవ‌ల తెలుగు డైరెక్ట‌ర్ల సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తున్నాయి. విజ‌య్ ఈ సినిమా చేయ‌డానికి ఇది కూడా ఓ కార‌ణ‌మే.

ఇక విజ‌య్ చివ‌రి సినిమా బీస్ట్‌. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో ద‌ళ‌ప‌తి – వంశీ సినిమా హిట్ అవ్వ‌డం ఇప్పుడు ఇద్ద‌రి కెరీర్ల‌కు ఇంపార్టెంట్ అయ్యింది. ఇక విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ను ఇప్పుడు నెటిజ‌న్లు ఆటాడుకుంటున్నారు.

ఈ సినిమాకు తమిళంలో ‘వారిసు’ అనే టైటిల్ ను సెట్ చేశారు. ది బాస్ రిటర్న్స్ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. చూడ‌డానికి ఆ స్టిల్లో విజ‌య్ మంచి బిజినెస్‌మేన్‌లా క‌నిపిస్తున్నాడు. విజయ్ స్టైలీష్ లుక్ చూడ‌డానికి బాగున్నా పోస్ట‌ర్ మీద అంద‌రు హీరోల అభిమానులు భీభ‌త్సంగా ట్రోలింగ్ చేస్తున్నాడు. ఇందుకు కార‌ణం.. ఈ సినిమా పోస్ట‌ర్ గ‌తంలో వంశీ డైరెక్ట్ చేసిన మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమా పోస్ట‌ర్‌ను పోలి ఉండ‌డ‌మే.

మ‌హ‌ర్షి సినిమాలో మ‌హేష్ బాబు ఏదైతే స్టైల్లో ఉంటాడో ఇప్పుడు విజ‌య్ కూడా అచ్చం అదే స్టైల్లో ఉన్నాడు. కాక‌పోతే వేసుకున్న డ్రెస్ క‌ల‌ర్ ఒక్క‌టే మారింది. దీంతో విజ‌య్ యాంటీ ఫ్యాన్స్ అంద‌రూ ఇప్పుడు ఆడేసుకుంటున్నారు. ఇక ఈ పోస్ట‌ర్‌కు మ‌హ‌ర్షి 2 అని.. ఎన్నో సినిమాల నుంచి కాపీ కొట్టేశారు అని ఓ ఆటాడేసుకుంటున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news