నగ్మా ఒకప్పుడు వెండితెరను ఏలేసిన ఆరేబియన్ గుర్రం. నగ్మా నడుస్తుంటే అరేబియన్ గుర్రం నడిచినట్టు ఉంటుందని అప్పట్లో అందరూ ఆమెను తెగ మెచ్చుకునే వారు. కావాల్సినంత అందం.. అభినయం.. స్టైల్ నడక, పర్ఫెక్ట్ ఫిగర్… తన క్యారెక్టర్లలో చూపించే పొగరు.. ముతులు పోగొట్టే హోయలు ఇవన్నీ ఆమెను ఇండియాలో అన్ని భాషల్లోనూ తిరుగులేని స్టార్ హీరోయిన్ను చేసేశాయి.
నగ్మా 25 డిసెంబర్, 1974న ముంబైలో జన్మించింది. ముందుగా మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన నగ్మా ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాలు చేసింది. 48 సంవత్సరాలు వచ్చినా నగ్మా ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. నగ్మా ఇద్దరు చెళ్లెళ్లు జ్యోతిక, రోషిణి ( రాధ) ఇద్దరూ కూడా హీరోయిన్లుగా చేశారు. విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు అక్కా చెళ్లెళ్లు కలిసి మెగాస్టార్ చిరంజీవితో నటించారు.
ఇక నగ్మా ప్రస్తుతం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తాజా రాజ్యసభ ఎన్నికల్లో తనకు ఎంపీ పదవి ఇవ్వలేదని తీవ్ర అసహనం, అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. నగ్మా వ్యక్తిగత జీవితం విఫలమవ్వడానికి, ఆమె వివాహానికి దూరం కావడానికి ఆమె గుడ్డిగా నమ్మిన వాళ్లు మోసం చేయడమే..! నగ్మా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు.. నలుగురు సెలబ్రిటీలను పిచ్చిగా ప్రేమించి.. వారితో డేటింగ్ కూడా చేసింది.
కొన్ని సార్లు పెళ్లయ్యి.. పిల్లలు ఉన్న వాళ్లతో కూడా నగ్మా ప్రేమలో పడడం ఆమె అమాయకత్వం అనుకోవాలో లేదా ఏంటో తెలియని పరిస్థితి. నగ్మా ముందుగా కోలీవుడ్ సీనియర్ హీరో శరత్‌కుమార్‌ను ప్రేమించింది.. అప్పటికే ఆయనకు పెళ్లయ్యి పిల్లలు కూడా ఉన్నారు. అయినా శరత్‌కుమార్ వలలో ఎందుకు పడిందో ? తెలియదు. తర్వాత కొన్నాళ్లకు శరత్‌కుమార్ పక్కన పెట్టడంతో భోజ్‌పురి హీరోలు మనోజ్‌తివారి, రవికిషన్ సింగ్‌తో ప్రేమలో పడింది.
మనోజ్ తివారికి అప్పటికే పెళ్లయ్యి పిల్లలు ఉన్నా కూడా అతడితో డేటింగ్ చేసిందన్న టాక్ గట్టిగా వినిపించింది. ఎక్కడ చూసినా వీరిద్దరే కలిసి తిరిగేవారు. చివరకు మనోజ్ తివారి నగ్మాను తన ఎంజాయ్‌మెంట్‌కు వాడుకున్నాడు. ఎప్పటకీ అయినా ఫ్యామిలీయే ముఖ్యం కదా.. నగ్మాను వదిలించేసుకున్నాడు.
ఇక చివరగా నగ్మా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌవర్ గంగూలీతో ప్రేమలో పడింది. అప్పట్లో గంగూలీ స్టార్ క్రికెటర్.. చిన్న వయస్సులోనే ఇండియన్ టీంకు కెప్టెన్‌గా ఉన్నాడు. పైగా వయస్సులో నగ్మా కంటే చిన్నోడు. అయినా కూడా నగ్మా అతడితో ఎక్కడ చూసినా చెట్టాపట్టాలేసుకుని తిరిగేది. అప్పటికే గంగూలీకి డోనాతో పెళ్లయ్యి పిల్లలు కూడా పుట్టారు. గంగూలీ ఒకానొక టైంలో డోనాకు వదిలేసి పూర్తిగా నగ్మాతో ఉండిపోయాడు.
శ్రీకాళహస్తిలో రహస్యంగా నగ్మా – గంగూలీ పూజలు కూడా చేశారు. ఈ ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. తర్వాత గంగూలీకి కూడా మనస్సు మార్చుకుని భార్యకు దగ్గరవ్వడంతో నగ్మా మళ్లీ ఒంటరిది అయిపోయింది. ప్రతిసారి కూడా నగ్మా పెళ్లయిన వాళ్లతోనే ప్రేమలో పడడం.. చివరకు వాళ్లు నగ్మాతో ఫుల్లుగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీ చెంతకు చేరిపోవడంతో మోసపోవడం నగ్మా వంతు అయ్యింది. ఇక ఇప్పటకీ ఆమె పెళ్లికి దూరంగా అలాగే ఉండిపోయింది.