యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అంటే ముందు మ్యూజిక్ డైరెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకంటే, తారక్ డాన్స్‌ను మైండ్‌లో పెట్టుకొని ట్యూన్స్ కంపోజ్ చేయాలి. ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ముందు తారక్ సినిమాకు అద్భుతమైన ట్యూన్స్ రెడీ చేసుకుంటాడు. ఇక కథ విన్నప్పుడే ఏ సీన్‌లో ఎలాంటి బీజిఎం ఇవ్వాలి. ఎలాంటి సౌండింగ్ ఉండాలి అనేది మార్క్ చేసి పెట్టుకుంటాడు. రీ రికార్డ్ సంతృప్తిగా లేక మళ్ళీ కొన్ని సీన్స్‌కు ఓవర్ నైట్ వర్క్ చేసిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే, తారక్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ఆ రేంజ్‌లో ఉంటాయి.
కొన్ని ఎమోషనల్ సీన్స్‌కు తారక్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అంతగా పాత్రలో లీనమవుతారు. దీనికి ఉదాహరణ, జై లవకుశ సినిమాలో జై పాత్ర, సింహాద్రి, టెంపర్, అరవింద సమేత, ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్‌లో కొమురమ్ భీమ్ పాత్ర..ఇలా చెప్పుకుంటూ ఒక్క సినిమా బాగోలేదని చెప్పడం ఫ్యాన్స్‌ను ఖచ్చితంగా హర్ట్ చేసినట్టే అవుతుంది.
ఏ పాత్రలో అయినా ఎన్టీఆర్ నటిస్తాడు అనే కంటే జీవించేస్తాడు. ఎన్టీఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి స్క్రీన్ మీద డైలాగులు చెపుతున్నా.. ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నా మనం మనలను మైమరచిపోయి మరోలోకంలోకి వెళ్లిపోతాము. అయితే, ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలకు మ్యూజిక్ హైలెట్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే, ఎన్టీఆర్ 30కి తమిళ యంగ్ సెన్షేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్సైయ్యాడు.
ఇప్పటికే, ఓ సాంగ్ కూడా రికార్డింగ్ అయిందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఎన్టీఆర్ 30 కి మ్యూజిక్ పరంగా స్వయంగా తారక్ అనిరుధ్‌కు పెద్ద ఛాలెంజ్ విసిరారట. ఈ సినిమాకు మ్యూజిక్ పరంగా హైలెట్ అయితే, సాలీడ్ గిఫ్ట్ కూడా ఆఫర్ చేశారట. ఇటీవల అనిరుధ్ సంగీతం అందించిన బీస్ట్, కమల్ విక్రమ్ సినిమాల సక్సెస్‌కు మ్యూజిక్ పరంగా క్రెడిట్ ఎక్కువగా దక్కించుకున్నాడు.
అంతేకాదు, విక్రమ్ సినిమా మ్యూజికల్‌గా హిట్ అయినందుకు కమల్ హాసన్ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు. అంతకంటే భారీ గిఫ్ట్ తారక్ ఆఫర్ చేశాడట. మరి ఎన్టీఆర్ 30కి అనిరుధ్ ఏ స్థాయిలో మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.