సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ వయస్సులోనూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతోంది. ఈ వయస్సులోనూ ఆమె కాల్షీట్ రావాలంటే చాలా కాస్ట్ లీ అయిపోయిందన్న చర్చలే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి సినిమాలోని శివగామి దేవి క్యారెక్టర్ తర్వాత రమ్యకృష్ణ ఇమేజ్ పాన్ ఇండియా లెవల్లో మార్మోగుతోంది. ఇప్పుడు ఆమె కాల్షీట్లు సంపాదించాలంటే చాలా కాస్ట్ లీ అయిపోయింది.
ఇక రమ్యకృష్ణ తండ్రిది నెల్లూరు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె ఎక్కువుగా చెన్నైలోనే పెరిగి.. అక్కడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రమ్యకృష్ణ సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో సినిమాలు చేసినా కూడా ఆమెకు ఎక్కువ గుర్తింపు వచ్చింది మాత్రం తెలుగు సినిమాలతోనే. ముఖ్యంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సినిమాలతోనే రమ్యకృష్ణ గ్లామర్ పరంగా బాగా పాపులర్ అయ్యింది.
ఆ తర్వాత ఆమె రజనీకాంత్ నరసింహా సినిమాలో రజనీతో ఢీ అంటే ఢీ అనే పాత్ర చేయడంతో ఆమెకు తిరుగులేకుండా పోయింది. ఇక రమ్యకృష్ణ పేరులోనూ ట్విస్ట్ ఉంది. ఆమె పేరు రమ్య కాగా.. తండ్రి పేరు కృష్ణ. తండ్రి పేరు కలుపుకుని రమ్యకృష్ణగా మార్చుకుంది. ఇక నాగార్జున హీరోగా గీతాకృష్ణ దర్శకత్వంలో సంకీర్తన సినిమా వచ్చింది. ఈ సినిమాలో కొతమ్మాయిని హీరోయిన్‌గా పెట్టుకోవాలని గీతా కృష్ణ ఫిక్స్ అయ్యారట.
సీనియర్ నటి రాజసులోచన సహకారంతో ఓ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్న రమ్యకృష్ణను చూసి ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారట. అయితే అప్పటికే ఆమె తమిళ్‌లో ఒకటి రెండు సినిమాలు చేసింది. ఆమె తెలుగులో సినిమాలు చేయలేదని సమాచారం ఇవ్వడంతో తెలుగులో రమ్యకృష్ణ ఫ్రెష్ పేస్ కదా ? అని ఆమెను సంకీర్తనలో హీరోయిన్‌గా పెట్టుకున్నారట. సంకీర్తన సినిమా మ్యూజికల్ హిట్ అయినా.. మంచి పేరు వచ్చినా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు.
అయితే ఈ సినిమా వచ్చిన మూడేళ్లకు గీతాకృష్ణ కోకిల సినిమా చేస్తుండగా అప్పుడు రమ్యకృష్ణ గురించి ఓ నిజం తెలిసిందట. ఆమెకు తెలుగులో సంకీర్తనే మొదటి సినిమా కాదని.. అంతకుముందే ఆమె తెలుగులో ఓ సినిమాలో చిన్న పాత్రలో నటించిందన్న విషయం తెలిసిందట. దీంతో గీతాకృష్ణకు రమ్యకృష్ణపై విపరీతమైన కోపం వచ్చేసిందట. అయితే అప్పటకీ చేసేదేం లేకపోవడంతో ఆయన అలా ఉండిపోయారట. తాను సంకీర్తన సినిమాలో కొత్తమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నానని.. అయితే అప్పటికే ఆమె తెలుగులో ఓ సినిమా చేసిన విషయం చెప్పలేదని గీతాకృష్ణ చెప్పారు.