Moviesస‌యంత లెస్బియ‌న్ రోల్ వెన‌కాల ఇంత టాప్ సీక్రెట్ ఉందా...!

స‌యంత లెస్బియ‌న్ రోల్ వెన‌కాల ఇంత టాప్ సీక్రెట్ ఉందా…!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఆమె ఏం చేసిన చర్చల్లో నిలుస్తుండటం ఆసక్తికరం. నాగ చైతన్యతో విడాకులు ప్రకటించక ముందు వరకు సమంతను చూసిన విధానం వేరు. ఎప్పుడైతే నాగ చైతన్యతో తాను విడిపోతున్నట్టు ప్రకటించారో అప్పటి నుంచి తీవ్రంగా ట్రోల్స్‌కు గురైవుతూనే ఉంది. ఇక సమంత కూడా పంజరంలో నుంచి బయటపడిన పక్షిలాగా నచ్చిన సినిమాలను, ప్రాజెక్ట్స్‌ను కమిటవుతోంది. ఆమె సినిమాలలో కనిపించే విధానం కూడా తారా స్థాయిలో చర్చలు జరగడానికి కారణం అవుతున్నాయి.

మజిలీ, ఓ బేబీ సినిమాలలో నటించిన సమంతేనా అని షాకవ్వాల్సి వస్తోంది. శాకుంతలం లాంటి పౌరాణిక చిత్రం చేస్తూనే తమిళ మల్టీస్టార‌ర్‌లో గ్లామర్ రోల్ చేసి ఆకట్టుకుంది. అయితే, దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2తో సమంత డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, దీనితోనే బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చినట్టు. ఇందులో సమంత పోషించిన రాజీ పాత్ర సీజన్2కి చాలా హైలెట్ అయింది. కెరీర్‌లో ఎప్పుడూ పోషించని డీ గ్లామర్ పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుది.

తీవ్రవాదిగా మారిన రాజీ చేసే యాక్షన్ సీన్స్ ఆమె చేసిన ఫైట్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. ఇక ఇందులో ఉన్న కొన్ని బోల్డ్ సీన్స్ సమంత కెరీర్ గ్రాఫ్‌ను మరోలా మళ్ళించిందని చెప్పాలి. శృంగార సన్నివేశంలో నటించి షాకిచ్చిన సమంత ..ఈ సన్నివేశాలను చూసిన హాలీవుడ్ డైరెక్టర్ సమంత ప్రధాన పాత్రలో ఓ ఇంగ్లీష్ సినిమా చేసేందుకు సంప్రదించారు. కాన్సెప్ట్ నచ్చడంతో సంమత వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక ఈ హాలీవుడ్ మూవీలో సామ్మ్ లెస్బియన్ పాత్రలో నటిస్తుంది. ఈ మధ్యకాలంలో సమంత మితిమీరిన అందాల ప్రదర్శనతో మతులు పోగొడుతోంది. వీలైనంత పొదుపుగా కాస్ట్యూమ్స్‌ ధరించి పాపులర్ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయడం, మ్యాగ్జైన్ కవ‌ర్‌ పేజీపై హాట్ హాట్ ఫోజులివ్వడం అందరిన్నీ ఆశ్వర్యానికి గురి చేస్తుంది. ఏదేమైనా స్మంత పడి లేచిన కెరటం. ఎవరూ అడ్డుకోలేరు ఆపలేరు.

అందుకే, సినిమాలు కూడా ఆ రేంజ్‌లో ఉంటున్నాయి. ప్రస్తుతం తెలుగులో యశద సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. అలాగే, సల్మాన్ సరసన రొమాన్స్ చేయబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఖుషి సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇలా కమర్షియల్ యాడ్స్, వెబ్ సిరీస్, సినిమాలే కాకుండా పలు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ క్షణం తీరిక లేఉండా గడుపుతోంది.

Latest news