మన తెలుగులో ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. అయితే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు ? అన్న దానికి మాత్రం రష్మిక మందన్న, పూజా హెగ్డే మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తోంది. సాయిపల్లవి సైతం రేసులో ఉన్నా రెమ్యునరేషన్‌తో పాటు స్టార్ హీరోలతో ఎక్కువుగా ఛాన్సుల పరంగా చూసుకుంటే పూజా , రష్మికయే స్టార్ స్టేటస్ ర్యాంకు కోసం ప్రధానంగా పోటీలో ఉన్నారు.
ఇక పూజా హెగ్డే ఎప్పుడో పదేళ్ల క్రితం జీవా హీరోగా వచ్చిన మాస్క్ సినిమాతో సౌత్ సినిమాకు హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతోనే ఆమెకు తెలుగులో గుర్తింపు వచ్చింది. అక్కడ నుంచి ఆమె వెనక్కు తిరిగి చూసుకోలేదు. చాలా తక్కువ టైంలోనే బన్నీ, చెర్రీ, ఎన్టీఆర్, మహేష్‌కు జోడీ కట్టేసింది.
అసలు ఒకానొక టైంలో ఆమె తెలుగులో వరుస ఆఫర్లతో క్షణం తీరిక లేనంత బిజీ అయిపోయింది. బన్నీ లాంటి హీరోలు ఆమెను రెండు సార్లు కూడా రిపీట్ చేయడం.. అటు త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ పూజాకు వరుస ఆఫర్లు ఇవ్వడంతో రెమ్యునరేషన్ విషయంలో పూజా చెట్టెక్కేసింది. చివరకు ఆమె ఒక్కో సినిమాకు రు. 3 కోట్లు తీసుకోవడంతో పాటు తనతో పాటు తన మేకప్మెన్లు, గన్మెన్ల బిల్లలు కూడా నిర్మాతల నెత్తిన వేసేస్తుంది.
దీంతో తెలుగు నిర్మాతల జేబులకు భారీగా చిల్లులు పడుతున్నా వారి అతి మంచితనం వల్ల పూజా చెప్పిందే వేదం అయ్యింది. అయితే ఇటీవల ఆమె ఖాతాలో వరుస ప్లాపులు పడ్డాయి. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య దెబ్బతో ఆమె క్రేజ్ తగ్గడంతో పాటు ఆమెను పట్టించుకునే వాళ్లు తగ్గుతున్నారు. తాజాగా ఆమె నటించిన బీస్ట్ సినిమా డిజాస్టర్ అయ్యింది. నిర్మాతలు కూడా భారీగా నష్టపోయారు.
షూటింగ్లో పూజా చేసిన ఖర్చులు దిమ్మతిరిగిపోయేలా ఉన్నాయట. పూజా తిండి ఖర్చులు, ఆమె బసచేసిన లగ్జరీ హోటల్స్, ఆమె స్టాఫ్ బిల్లులు ఇవన్నీ కలిపి నిర్మాతలు పూజాకు నువ్వే కట్టుకోమని పంపారట. ఇవన్నీ నీకు మేం ఇస్తామని చెప్పలేదని.. ఇంత భారీ బిల్లులు మా నెత్తిన రుద్దితే మేం ఎందుకు ? కట్టాలని కూడా వారు ప్రశ్నించడంతో పూజాకు మామూలు షాక్ కాదన్న గుసగుసలు నడుస్తున్నాయి. నిర్మాతలు ఇచ్చిన షాక్‌తో తెలుగు నిర్మాతలే చాలా నయ్యం అని… తాము ఏం చేసినా ఇబ్బంది పెట్టరని ఆమె సన్నిహితుల వద్ద వాపోయిందట.