Moviesశోభిత ధూళిపాళ‌తో చైతు ఎఫైర్ న్యూస్‌... ట్విట్ట‌ర్లో స‌మంత ఘాటు వ్యాఖ్య‌లు...!

శోభిత ధూళిపాళ‌తో చైతు ఎఫైర్ న్యూస్‌… ట్విట్ట‌ర్లో స‌మంత ఘాటు వ్యాఖ్య‌లు…!

అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన ద‌గ్గ‌ర నుంచి స‌మంత త‌న ప‌నేదో తాను చేసుకుంటోంది. అయితే త‌న సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల‌లో మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక‌టి స్పందిస్తూనే వ‌స్తోంది. త‌న విడాకుల వెన‌క ఏం జ‌రిగిందో చిన్న చిన్న హింట్లు ఇచ్చేలా.. ర‌క‌ర‌కాల అనుమానాలు వ‌చ్చేలా స‌మంత కామెంట్లు ఉండేవి. ఏదేమైనా ఎవ‌రి దారుల్లో వారు బ‌తుకుతున్నారు. ఎవ‌రి సినిమాలు వారు చేసుకుంటున్నారు.

అయితే చైతుతో విడాకుల త‌ర్వాత స‌మంత అక్కినేని అభిమానుల‌కు చేదు అయిపోయింద‌న్న‌ది నిజం. అక్కినేని అభిమానులే కాకుండా కొంద‌రు తెలుగు సినీ అభిమానులు కూడా స‌మంత‌కు సోష‌ల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్‌గా మారారు. చైతు విష‌యంలో ఏం వార్త వ‌చ్చినా దానికి, స‌మంత‌కు ఏదో ఒక లింక్ పెట్టి కామెంట్లు చేయ‌డం వీళ్ల‌కు అల‌వాటు అయ్యింది.

అయితే తాజాగా స‌మంత ఇప్పుడు చైతుకు మ‌రో యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ‌తో ఎఫైర్ ఉంద‌ని వ‌చ్చిన వార్త‌ల‌పై ఘాటుగా స్పందించింది. వీరిద్ద‌రి ఎఫైర్ వార్త‌ల‌ను ముందుగా బాలీవుడ్ మీడియా స్ప్రెడ్ చేసింది. ఆ త‌ర్వాత నిన్న‌టి నుంచి ఈ వార్త‌ల‌ను మ‌న తెలుగు మీడియా వాళ్లు కూడా రాసి ప‌డేస్తున్నారు. అయితే ఈ వార్త‌ల వెన‌క స‌మంత పీఆర్ టీం ఉన్న‌ట్టు కొంద‌రు చై ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే వార్త‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా స్పందించ‌ని స‌మంత ఇప్పుడు బ‌ల‌మైన కౌంట‌ర్ ఎటాక్ ఇచ్చేసింది. స‌మంత పీఆర్ టీం మ‌హిమ వ‌ల్లే చైతు – శోభిత ఎఫైర్ వార్త‌లు వ‌స్తున్నాయ‌న్న దానిపై స‌మంత తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టుగా ఆమె చేసిన ట్వీట్ చెప్ప‌క‌నే చెప్పేసింది.

Rumours on girl – Must be true.. Rumours on boy – Planted by girl.. Grow up guys ..
Parties involved have clearly moved on .. you should move on too !! Concentrate on your work … on your families .. move on అని స‌మంత కౌంట‌ర్ ఇచ్చింది. తాము ప్ర‌శాంతంగా త‌మ బ‌తుకులు తాము బ‌తుకుతున్నాం.. మీరు కూడా మారి .. మీ ప‌ని మీరు చూసుకోమ‌న్న‌ట్టుగా స‌మంత‌ చెప్పింది. స‌మంత చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news