Moviesబాల‌య్య‌కు క‌రోనా పాజిటివ్‌కు కార‌ణం ఇదేనా...!

బాల‌య్య‌కు క‌రోనా పాజిటివ్‌కు కార‌ణం ఇదేనా…!

క‌రోనా ఈ ప్ర‌పంచాన్ని వీడి అయితే పోలేదు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా పెరుగుతోన్న కేసులు ఫోర్త్ వేవ్‌కు సంకేతాలు అన్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. అంతా త‌గ్గిపోయింది అనుకుంటోన్న టైంలో క‌రోనా ఇప్పుడు మెల్ల‌గా చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ఎక్క‌డ చూసినా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. జంట న‌గ‌రాల్లో కేసులు వేలల్లో ఉంటాయ‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ హీరో బాల‌కృష్ణ‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్న‌యి. బాల‌య్య ఎప్పుడూ జ‌న స‌మూహంలోనే ఉంటారు. అయితే షూటింగ్‌లు లేదా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన హిందూపురంలో ప్ర‌జ‌ల్లో ప‌ర్య‌టించాలి.. లేక‌పోతే బ‌స‌వ తార‌కం ఆసుప‌త్రి ప‌నుల్లో ఇలా ఎక్కువుగా బ‌య‌టే బిజీగా తిరుగుతూ ఉంటారు.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న కోవిడ్ భారిన ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది. బాల‌య్య‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చినా కూడా ఎలాంటి ల‌క్ష‌ణాలు లేకుండా ఆరోగ్యంగానే ఉన్నార‌ని తెలుస్తోంది. అయితే అభిమానులు మాత్రం ఈ వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో కాస్త ఆందోళ‌న చెందుతున్నారు. బాల‌య్య ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న జై బాల‌య్య సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా టైటిల్ ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. బాల‌య్య‌కు ఇది కెరీర్ ప‌రంగా 107వ సినిమా. శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు థ‌మ‌న్ స్వ‌రాలు ఇస్తున్నారు. మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే బాల‌య్య 108వ సినిమా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంది. సాహు గార‌పాటి ఈ సినిమాకు నిర్మాత‌. బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ ఈ సినిమాకు ప‌రిశీలిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news